నేడే హీరాపూర్ లో గ్రామసభ
03-05-2026 05:14 PM
ఉట్నూర్,(విజయక్రాంతి): ఇంద్రవెల్లి మండలంలోని హీరాపూర్ గ్రామపంచాయతీ కేంద్రంలో సోమవారం గ్రామ సభ నిర్వహించుటకు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ రాజర్శి షా, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, పిఓ మంద మకరందుల ఆధ్వర్యంలో నిర్వహించే గ్రామ సభను విజయవంతం చేసేందుకు స్థలాన్ని పరిశీలించారు. ఐటీడీఏ ఏపీవో జనరల్ వసంతరావు జాదవ్, డిడి అంబాజీ జాదవ్, పీవీటీజీ ఏపీవో ఆత్రం భాస్కర్, ఇంజనీరింగ్ విభాగం ఈ ఈ తానాజీ జాదవ్ ల తో పాటు ఐటీడీఏ శాఖ అధికారులు, సర్పంచ్ తొడసం లక్ష్మీబాయి, స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు గ్రామాభివృద్ధికి కావలసిన కనీస సౌకర్యాలపై గ్రామ సభలో చర్చించి తీర్మానం చేయనున్నట్లు అధికారులు తెలిపారు.






