20 April, 2026 | 2:00 AM

ప్రజా సమస్యలను పరిష్కరించేది కాంగ్రెస్సే

20-04-2026 12:15 AM

కాంగ్రెస్ పార్టీ కూకట్‌పల్లి ఇంచార్జ్ బండి రమేష్ 

కూకట్‌పల్లి, ఏప్రిల్ ౧౯ (విజయక్రాంతి): నియోజకవర్గంలోని సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తున్నామని టీపీసీసీ ఉపాధ్యక్షుడు కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆదివారం ఆయన స్థానిక నాయకులతో కలిసి మోతినగర్ పరిధిలోని అవంతినగర్ తోటలో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు బస్తీలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను రమేష్‌కి విన్నవించారు.

సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కారానికి కృషి చేస్తానని రమేష్ గారు స్థానికులకు హామీ ఇచ్చారు. ఈ కార్య క్రమంలో మోతినగర్ మాజీ కార్పొరేటర్ సయ్యద్ బాబు, కాలనీ అధ్యక్షులు కే గోపాల్ చౌదరి, జనరల్ సెక్రెటరీ కే కృష్ణ, ట్రెజరర్ ఎం రమేష్, సత్య రెడ్డి, మురళి, సుమంత్, సంతోష్, సుధాకర్, సురేందర్ గౌడ్, ఉమేష్, రియాజ్, శ్రీహరి, మహేష్, కె శశి, అనిల్, కాలనీల సభ్యులు పాల్గొన్నారు.