10 April, 2026 | 3:19 AM

జీవన్‌రెడ్డి పార్టీని వీడటం బాధాకరం

10-04-2026 01:36 AM
  1. ఢిల్లీ నాయకత్వం రంగంలోకి దిగితే బాగుండేది 

పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి

సంగారెడ్డి, ఏప్రిల్ 9 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్‌రెడ్డి పార్టీని వీడటం చాలా బాధాకరమని టీపీసీసీ వర్కిం గ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జీవన్‌రెడ్డి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కుటుంబానికి, కాంగ్రెస్ పార్టీకి విధేయుడుగా ఉన్నారని గుర్తు చేశారు.జీవన్‌రెడ్డి విషయంలో అంతర్గతంగా ఏం జరుగుతుందో ఏఐసీసీ స్థాయిలో చెక్ చేసుకోవాల్సి ఉండాల్సిందన్నారు.

నేరుగా డిల్లీ నాయకత్వమే రంగంలోకి దిగి సమస్యను పరిష్కరించి ఉంటే బాగుండేదని, ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని స్పష్టం చేశారు.ఎమ్మెల్యేలు, నాయకులు పార్టీలు మారడం ప్రస్తుత రాజకీయాల్లో సహజమన్నారు. జీవన్ రెడ్డి పార్టీ మారడానికి గల కారణాలను బహిరంగంగా మీడియాతో మాట్లాడలేమని, అంతర్గ తంగా పార్టీలో చర్చిస్తామన్నారు.