25 June, 2026 | 2:49 PM

యశోద హాస్పిటల్‌లో ‘హైపర్‌సైట్’ వైద్యం

25-06-2026 01:47 PM

నిర్మల్ జూన్ 25 ( విజయ క్రాంతి): క్యాన్సర్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా యశోద హాస్పిటల్, కొత్త మైలు రాళ్లతో ముందుకు వెళ్తుందని  యశోద హాస్పిటల్స్  క్యాన్సర్ నిపుణురాలు డా. స్రవంతి రెడ్డి పేర్కొన్నారు. గురువారం నిర్మల్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల ఆమె మాట్లాడారు. క్యాన్సర్ లక్షణాలు మరియు ప్రస్తుతం అందుబాటులో ఉన్న సరికొత్త చికిత్సా పద్ధతుల గురించి విస్తృతంగా వివరించారు. యశోద అందిస్తున్న హైపర్ సైట్ టెక్నాలజీ వైద్యంపై వివరించారు ఒకప్పుడు క్యాన్సర్‌ను మరణశిక్షగా భావించేవారని, కానీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, ఇప్పుడు స్టేజ్ IVలో ఉన్నట్లు నిర్ధారణ అయిన రోగులు కూడా చాలా సంవత్సరాల పాటు సాధారణ జీవితాన్ని గడపగలరని ఆమె పేర్కొన్నారు.

యశోద హాస్పిటల్ నిర్వహిస్తున్న కొత్త టెక్నాలజీ పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అన్ని జిల్లాల్లో చైతన్య సదస్సులు నిర్వహిస్తున్నము అని తెలిపారు. క్యాన్సర్ రావడానికి గల కారణాలను వివరించి వైద్య విధానం ద్వారా సంపూర్ణ వ్యాధి నిర్మూలన లక్ష్యంగా యశోద హాస్పిటల్ వైద్యం అందిస్తుందని  తెలిపారు. క్యాన్సర్ రోగులు తమ వ్యాధి దశను నిర్ధారించుకోవడానికి మరియు తగిన అధునాతన చికిత్స పొందడానికి సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రిని సందర్శించాలని డాక్టర్ స్రవంతి రెడ్డి సూచించారు. ఈ సమావేశంలో  పీఆర్ఓ ఎ. శ్రీకాంత్, వి. లోకేష్ బాబు లు పాల్గొన్నారు.