ఓటరు జాబితా సవరణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
బెజ్జంకి, జూన్ 25: ఓటు ప్రతి పౌరుడి హక్కు మాత్రమే కాకుండా బాధ్యత కూడా అని గూడెం గ్రామ సర్పంచ్, సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు గూడెల్లి శ్రీకాంత్ అన్నారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరూ తమ వివరాలను పరిశీలించి అవసరమైతే సవరించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓటరు జాబితాలో పేరు, చిరునామా, ఇతర వివరాల్లో ఏవైనా మార్పులు ఉంటే వెంటనే నమోదు చేసుకోవాలని సూచించారు. ఇంటి వద్ద లేకపోయినా ఆన్‌లైన్ ద్వారా వివరాలను నమోదు చేసుకునే అవకాశం ఉందని, ప్రజలు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ప్రతి ఓటు ఎంతో కీలకమని పేర్కొన్న ఆయన, అర్హులైన ప్రతి పౌరుడు ఓటరు జాబితాలో తన పేరు నమోదైందో లేదో నిర్ధారించుకోవాలని అన్నారు. ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రజలు చురుకుగా పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు






