25 June, 2026 | 2:25 PM

Breaking News

నిజాంసాగర్ పోలీసుల ఆధ్వర్యంలో ముమ్మర వాహన తనిఖీలు

25-06-2026 01:42 PM

నిజాంసాగర్ జూన్ 25(విజయక్రాంతి): రోడ్డు ప్రమాదాలను అరికట్టడంతో పాటు నిద్ర నిబంధనలను ఉల్లంఘించిన వాహనాలపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, గురువారం రోజు బొగ్గు గుడిసె నుండి నిజాంసాగర్ వెళ్ళే దారిలో సబ్-ఇన్‌స్పెక్టర్ జె శివ కుమార్ తన సిబ్బందితో కలిసి ముమ్మర వాహన తనిఖీలు నిర్వహించారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ,,ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలను అరికట్టడమే ధ్యేయంగా ఈ తనిఖీలు చేపట్టడం జరిగింది. ఈ తనిఖీల్లో భాగంగా ద్విచక్ర వాహనాలు, ఆటోలు మరియు కార్లతో సహా మొత్తం 120 వాహనాలను ఆపి క్షుణ్ణంగా తనిఖీ చేశారు.హెల్మెట్ లేకపోవడం, త్రిబుల్ రైడింగ్, నెంబర్ ప్లేట్లు సరిగ్గా లేకపోవడం, సీట్ బెల్ట్ ధరించకపోవడం, లైసెన్స్ లేకపోవడం,మోడిఫైడ్ సైలెన్సర్లతో తిరుగుతున్న వాహనాలపై మొత్తం 20 కేసులు నమోదు చేయడం జరిగిందని నిజాంసాగర్ ఎస్ ఐ తెలిపారు.