నాగర్ కర్నూల్ నూతన ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా వేణుగోపాల్ రెడ్డి
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ (ఈఎస్) గాయత్రికి పదోన్నతితో బదిలీ అయ్యారు. గురువారం తెలంగాణ ఎక్సైజ్ శాఖ చేపట్టిన తాజా బదిలీల్లో భాగంగా ఆమెను మెదక్ జిల్లా అసిస్టెంట్ కమిషనర్‌గా నియమించారు. గాయత్రి నాగర్ కర్నూల్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తూ శాఖ పరిపాలనలో కీలక పాత్ర పోషించారు. ఆమె పదోన్నతితో బదిలీ కావడంతో నాగర్‌కర్నూల్ జిల్లాకు నూతన ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా వేణుగోపాల్ రెడ్డి నియమితులయ్యారు. వేణుగోపాల్ రెడ్డి గతంలో ఖమ్మం జిల్లాలో అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్‌గా విధులు నిర్వహించారు. తాజా బదిలీల్లో భాగంగా ఆయనకు పదోన్నతి లభించి నాగర్ కర్నూల్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా బాధ్యతలు అప్పగించారు. త్వరలోనే ఆయన జిల్లా కేంద్రంలో బాధ్యతలు స్వీకరించనున్నారు.






