సింగరేణి రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి
CMPF అసిస్టెంట్ కమిషనర్ కు వినతి పత్రం అందజేత
నస్పూర్,(విజయక్రాంతి): సింగరేణి రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బుధ వారం సింగరేణి రిటైర్మెంట్ కార్మిక సంఘం నాయకులు గోదావరిఖనిలోని CMPF రీజినల్ కార్యాలయంలో అసిస్టెంట్ కమీషనర్ గోవర్ధన్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్, సింగరేణి ఇతర ఏరియాలలో సింగరేణి విశ్రాంత ఉద్యోగుల ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించాలని కోరారు.
విశ్రాంత ఉద్యోగులకు ప్రతి నెల ఒకటవ తేదిన వివిధ బ్యాంకులలో ఖాతాదారులైన బొగ్గు పెన్షన్ దారులకు వారి వారి ఖాతాలలో పెన్షన్ జమయ్యే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని, ఈ నెల SBI ఖాతాదారులకు 1న కాకుండా 3వ తేదీన పెన్షన్ వారి ఖాతాలో జమ కావడం వల్ల అతి తక్కువ పెన్షన్ పొందుతున్న సింగరేణి విశ్రాంత ఉద్యోగులు నానా రకాలుగా ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని , అదే విధంగా వేలాది మంది విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్ పేమెంట్ ఆర్డర్ (PPO) కాపీలు అందలేదని, వెంటనే ఇప్పించే ఏర్పాటు చేయాలని, పదవీ విరమణ చేస్తున్న సింగరేణి విశ్రాంత ఉద్యోగుల క్లేయిమ్స్ జాప్యం కాకుండా త్వరగా పరిష్కరించాలని కోరారు.






