4 March, 2026 | 5:18 AM

ఇజ్రాయెల్ భీకర దాడులు

04-03-2026 01:12 AM
  1. లెబనాన్‌లోని హెజుబుల్లా స్థావరాలు ధ్వంసం

పీఐజే కమాండర్ అబూ హమ్జా మృతి?

దాడుల్లో ఇప్పటివరకు ౫౦ మందికి పైగా మృతి

టెలీ అవీవ్/ బీరుట్, మార్చి ౩: పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ తన సైనిక చర్యలను మంగళవారం మరింత ఉధృతం చేసింది. దీనిలో భాగంగానే క్షిపణులతో దాడులు చేసింది. ఇరాన్‌లో వెయ్యికి పైగా లక్ష్యాలను ధ్వంసం చేసింది. లెబనాన్‌లోని హెజుబుల్లా స్థావరాలపై క్షిపణులను ధ్వంసం చేసింది. ఆయుధ నిల్వల స్థావరాలను నామ రూపాల్లేకుండా చేసింది. దాడుల్లో ప్రాణనష్టం సంభవించింది.

అయితే.. దీనిపై ఇరుదేశాల నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. లెబనాన్ రాజధాని బీరుట్‌పై జరిపిన దాడిలో పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్ (పీఐజే) కమాండర్ అబూ హమ్జా మృతి చెందినట్టు తెలుస్తోంది. అగ్రదేశాల మద్దతుతో అత్యాధునిక సాంకేతికతను వాడుతూ శత్రువుల కదలికలపై నిఘా పెట్టింది. ఇజ్రాయెల్ దాడుల్లో  50 మందికిపై లెబనాన్ హెజుబుల్లా కమాండర్లు, ప్రభుత్వ అధికారులు, సాధారణ ప్రజలు మృతిచెందరని, 150 మందికి పైగా గాయపడ్డారని అక్కడి అధికారిక వర్గాలు తెలిపాయి.

ఇరాన్ కార్యాలయాలపైనా..

ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని కీలకమైన ప్రభుత్వ కార్యాలయాల లక్ష్యంగా ఇజ్రాయెల్ క్షిపణులు ప్రయోగించింది. ఇరాన్ అధ్యక్షుడి భవన సముదాయంతోపాటు ఆ దేశ అత్యున్నత భద్రతా మండలి భవనాన్ని, లీడర్‌షిప్ కాంపౌండ్‌నూ ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు నేలమట్టం చేశాయి. అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన అధికారిక కార్యాలయాలను నేలమట్టం చేయడం ఇజ్రాయెల్ ఎయిర్‌ఫోర్స్ బలాన్ని సూచిస్తున్నది.