20 June, 2026 | 6:37 PM

Breaking News

మధిర కోర్టు ఆవరణలో జాతీయ మెగా లోక్ అదాలత్   •   సింగరేణి ఖాళీ క్వార్టర్ల సద్వినియోగానికి చర్యలు తీసుకోవాలి: ఏఐటీయూసీ   •   కొమరారం మండల ఏర్పాటుకు మంత్రి దామోదర రాజనరసింహకు వినతి   •   యువత హక్కుల కోసం కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుంది   •   రైతులను నమ్మించి నట్టేట ముంచుతారా   •   కేరళ గ్లోబల్ హై స్కూల్‌లో ఘనంగా ముందస్తు యోగా దినోత్సవం   •   అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి   •   సీఆర్టీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్   •   ఆస్పత్రి సిబ్బందిపై కలెక్టర్ ఆగ్రహం   •   కనగర్తిలో ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్న గ్రామస్తులు   •  

ఇరాన్ యుద్ధం 11వ రోజు.. విమానాశ్రయాలపై దాడులు, డ్రోన్ దాడులతో ఉద్రిక్తత

10-03-2026 11:34 AM

టెహ్రాన్: మధ్యప్రాచ్యంలో భీకర యుద్ధం పదకొండవ రోజు కొనసాగుతోంది. ఇరాన్ లోని 6 విమానాశ్రయాలపై దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. దాదాపు 1,900 మంది శత్రు సైనికులు మృతి చెందినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. ప్రతిదాడిగా ఇజ్రాయెల్, అమెరికా స్థావరాలపై ఇరాన్ డ్రోన్ల దాడి చేస్తోంది. ఇజ్రాయెల్, అమెరికాపై ఇరాన్ 33వ విడత డ్రోన్లు, క్షిపణుల దాడి చేసింది. అమెరికాకు చెందిన రెండు అత్యాధునిక డ్రోన్లను ధ్వంసం చేసినట్లు ఇరాన్ ప్రకటించింది.

ఇరాన్ జరిపిన దాడుల్లో మరో అమెరికా సైనికుడు(American soldier) మృతి చెందాడు. బెహ్రెయిన్ లోని బాప్కో చమురు శుద్ధి కర్మాగారం లక్ష్యంగా ఇరాన్ డ్రోన్ల దాడి చేస్తోంది. పశ్చిమాసియా యుద్ధం దృష్ట్యా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) పుతిన్ తో ఫోన్లో మాట్లాడారు. ట్రంప్, పుతిన్ దాదాపు గంటసేపు ఫోన్ లో కీలక అంశాలపై చర్చించారు.

అమెరికా, ఇరాన్(America, Iran) మధ్య  జరుగుతున్న యుద్ధంపై ఇరువురు నేతలు చర్చించారు. యుద్ధాన్ని త్వరగా ముగించేందుకు పుతిన్ కొన్ని ప్రతిపాదనలు చేసినట్లు క్రెమ్లిన్ వెల్లడించారు. యుద్ధాన్ని దౌత్యమార్గాల ద్వారా పరిష్కరించుకోవటంపై ఇరు దేశాల నేతలు చర్చలు జరిపారు. ఉక్రెయిన్ యుద్ధం, వెనెజువెలా అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చినట్లు క్రెమ్లిన్(Kremlin) పేర్కొన్నారు. ఈ చర్చలు యుద్ధ వాతావరణాన్ని తగ్గించేందుకు ఉపయోగపడతాయని రష్యా వెల్లడించింది.


ఇవి కూడా చదవండి:

మొజ్తాబా ఖమేనీ ఎంపికపై ట్రంప్ ఆగ్రహం.. ‘ఇరాన్ తప్పు చేసింది’

బ్యారెల్‌కు $110 చేరిన ముడి చమురు.. రూపాయి పతనం, ఆర్థిక వ్యవస్థపై భారం

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా మొజ్తాబా ఖమేనీ