25 April, 2026 | 4:03 PM

మొజ్తాబా ఖమేనీ ఎంపికపై ట్రంప్ ఆగ్రహం.. ‘ఇరాన్ తప్పు చేసింది’

10-03-2026 12:01 PM
  1. ఇరాన్ సుప్రీం లీడర్‌గా మొజ్తాబా ఖమేనీ
  2. మొజ్తాబా ఖమేనీ నియామకంపై ట్రంప్ నిరాశ
  3. మొజ్తాబా వల్ల కూడా అవే సమస్యలు 
  4. ఇరాన్ యుద్ధంపై పుతిన్‌తో మాట్లాడాను
  5. యుద్ధం పట్ల పుతిన్‌ సంతృప్తిగానే ఉన్నారు: ట్రంప్

వాషింగ్టన్: ఇరాన్ పై యుద్ధం చాలా వరకు పూర్తయిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) ప్రకటించారు. గతంలో అంచనాకు నాలుగైదు వారాల కన్నా ముందే ముగిసిపోతుందని ట్రంప్ వెల్లడించారు. ఇరాన్ కు ఇప్పుడు నేవీ, ఎయిర్ ఫోర్స్, కమ్యూనికేషన్లు లేవని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ క్షిపణులు చెల్లాచెదురుగా పడుతున్నాయని ఆయన తెలిపారు. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీని(Iran's Supreme Leader Mojtaba Khamenei) ఎంపిక చేయడంపై అమెరికా అధ్యక్షుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మొజ్తబా ఖమేనీ(Mojtaba Khamenei) ఎంపిక విషయంలో ఇరాన్ పెద్ద తప్పు చేసిందని ట్రంప్ స్పష్టం చేశారు. మొజ్తబా ఎంతకాలం పదవిలో కొనసాగుతారో తెలియదని ట్రంప్ పేర్కొన్నారు. మొజ్తబా ఎంపిక సరైన నిర్ణయం కాదని తాను భావిస్తున్నట్లు ట్రంప్ సూచించారు. తన మనసులో మొజ్తబా ఖమేనీకి బదులుగా మరోకరు ఉన్నారని ట్రంప్ పేర్కొన్నారు. మొజ్తాబా వల్ల కూడా అవే సమస్యలు వస్తాయని డొనాల్డ్ ట్రంప్(Donald Trump) వెల్లడించారు. ఇరాన్ తో యుద్ధంపై పుతిన్‌తో మాట్లాడానని చెప్పిన ట్రంప్ పుతిన్‌(Vladimir Putin ) యుద్ధం పట్ల సంతృప్తిగానే ఉన్నారని వెల్లడించారు.


ఇవి కూడా చదవండి:

ఇరాన్ యుద్ధం 11వ రోజు.. విమానాశ్రయాలపై దాడులు, డ్రోన్ దాడులతో ఉద్రిక్తత

బ్యారెల్‌కు $110 చేరిన ముడి చమురు.. రూపాయి పతనం, ఆర్థిక వ్యవస్థపై భారం

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా మొజ్తాబా ఖమేనీ