సన్‌రైజర్స్ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్
- కొన్ని మ్యాచ్‌లకు కమ్మిన్స్ దూరం
- అభిషేక్ శర్మకు వైస్ కెప్టెన్సీ
హైదరాబాద్, మార్చి 18 : ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ కీల క నిర్ణయం తీసుకుంది. ఊహించినట్టుగానే రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ సీజన్ లో కొ న్ని మ్యాచ్‌లకు దూరమయ్యాడు. దీంతో సన్‌రైజర్స్ యాజమాన్యం కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేసింది. అంతా అనుకున్నట్టుగానే విధ్వంసకర ఆటగాడు ఇషాన్ కిషన్‌ను సారథిగా నియమించింది. కమ్మిన్స్ కోలుకుని జట్టుతో చేరే వరకూ ఇషానే నడిపిస్తాడని ఎస్‌ఆర్ హెచ్ ప్రకటించింది.
అలాగే ఇషాన్ కిషన్‌కు డిప్యూటీగా అభి షేక్ శర్మ వ్యవహరించనున్నాడు. కమ్మిన్స్ గత ఏడాది చివర్లో వెస్టిండీస్ తో మ్యాచ్ సందర్భం గా గాయపడ్డాడు. అప్పటి నుంచీ కాంపిటేటివ్ క్రికెట్‌కు దూరమయ్యాడు. యాషెస్ లో కేవ లం ఒక మ్యాచ్ మాత్రమే ఆడిన కమ్మిన్స్ భార త్‌తో సిరీస్ , టీ20 ప్రపంచకప్ నుంచి సైతం తప్పుకున్నాడు. ప్రస్తుతం క్రికెట్ ఆస్ట్రేలియా మెడికల్ టీమ్ పర్యవేక్షణలో కోలుకుంటున్నా డు. సీఏ మెడికల్ టీమ్ క్లియరెన్స్ ఇచ్చేంత వరకూ ఐపీఎల్ ఆడేందుకు వీలులేదు.
ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ ఇషాన్ కిష కు బాధ్యతలు అప్పగించింది. కాగా కెప్టెన్సీ విషయంలో అభిషేక్ శర్మ పేరును కూడా పరిశీలించినా ప్రస్తు తం అతను పేలవ ఫామ్‌లో ఉండడంతో వెన క్కి తగ్గింది. అనవసరంగా కెప్టెన్సీ ఒత్తిడితో ఇబ్బంది అభిషేక్‌ను మరింత ఇబ్బంది పెట్టకూడదని భావించింది. అతన్ని భవిష్యత్తు సారథి గా భావిస్తున్న సన్‌రైజర్స్ ప్రస్తుతం ఇషాన్ కు డిప్యూటీగా ఎంపిక చేసింది.
గత ఏడాది సయ్య ద్ ముస్తాక్ అలీ టోర్నీలో జార్థండ్‌కు సారథిగా వ్యవహరించిన ఇషాన్ కిషన్ వ్యక్తిగతంగానూ అద్భుతంగా రాణించి ఆ జట్టును ఛాంపియన్‌గా నిలిపాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీ ఎల్ 2025 మెగా వేలంలో ఇషాన్ కిషన్‌ను రూ.11.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ సీజన్‌లో ఇషాన్ 14 మ్యాచ్ లు ఆడి 150కి పైగా స్ట్రైక్ రేట్ తో 354 రన్స్ చేశాడు. ఇక కమ్మిన్స్ కెప్టెన్సీలో హైదరాబాద్ గత సీజన్‌ను ఆరో స్థానంతో ముగించింది.




