calender_icon.png 10 February, 2026 | 9:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిజిస్ట్రేషన్ పేరుతో దందా?

10-02-2026 12:00:00 AM

కోర్టులో వివాదం భూములు..

కూకట్‌పల్లి, బోయిన్‌పల్లి డివిజన్ చిత్రిగడ్డలో అక్రమ డబుల్ రిజిస్ట్రేషన్ల కలకలం

సికింద్రాబాద్, ఫిబ్రవరి 9 (విజయ క్రాంతి): కూకట్‌పల్లి నియోజకవర్గంలోని బోయిన్పల్లి డివిజన్ పరిధిలో ఉన్న చిత్రిగడ్డ (హస్మత్ పేట్) ప్రాంతం మరోసారి వివాదాల కేంద్రంగా మారింది. ఇప్పటికే కోర్టులో స్థలాలపై కేసులు నడుస్తున్నప్పటికీ,అదే భూముల పై అక్రమ డబుల్ రిజిస్ట్రేషన్లు జోరుగా జరుగుతున్నాయనే ఆరోపణలు స్థానికంగా గుసగుసలుగా కాకుండా బహిరంగ విమర్శలుగా మారుతున్నాయి.

స్థానికు ల ఆరోపణల మేరకు,ఒకే భూమిని పలుమార్లు రిజిస్ట్రేషన్ చేయడం,కోర్టు స్టేలు, వివాదాలు ఉన్నా వాటిని పక్కనపెట్టి లావాదేవీలు జరగడం వెనుక బలమైన సెటిల్మెం ట్ వ్యవస్థ పనిచేస్తోందని అంటున్నారు. ఈ వ్యవహారంలో రిజిస్ట్రేషన్ మాఫియాతో పాటు, స్థానిక రియల్ ఎస్టేట్ బ్రోకర్ స్థానిక పోలీస్ స్టేషన్లో ‘సర్దుబాటు’లు జరుగుతున్నాయన్న ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

భూములపై ఎలా రిజిస్ట్రేషన్లు.?

చిత్రిగడ్డకు సంబంధించిన అనేక ప్లాట్లు, భూములపై కోర్టులో సివిల్ వివాదాలు నడుస్తున్న విషయం అధికారిక రికార్డుల్లోనే స్పష్టం గా ఉంది. అయిన సరే ఆ భూములపై రిజిస్ట్రేషన్లు ఎలా జరుగుతున్నాయి.? ఎవరి అను మతితో చేస్తున్నారు.? ఏ ఆధారాలతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతుంది.? అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రజల్లో చర్చకు వస్తున్నాయి.

బాధితులెవరు.? లాభం ఎవరికి?

చిత్రి గడ్డలో ఒకే భూమిని మంది బ్రోక ర్లు యజమానిగా చెప్పుకునీ వారికి కొంత అడ్వాన్స్ గా ఇచ్చి, ఇద్దరు,ముగ్గురికి ఎగ్రిమెంట్‌తో అమ్మి రిజిస్ట్రేషన్ చేయించి చివ రకు కోర్టుల చుట్టూ తిరిగేది సామాన్య ప్రజ లే లాభపడేది మాత్రం భూదందా గాళ్లు, మధ్యవర్తులు అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివాదాలు ఉన్న భూము ల్లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్న జిహెచ్‌ఎంసి అధికారులు వాటికి ఎలా పర్మిషన్ ఇస్తున్నారని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్, రెవెన్యూ, స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ, పోలీస్ ఉన్నతాధికారులు స్వయంగా జోక్యం చేసుకుని విచారణ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కోర్టు పరిధిలో ఉన్న భూములపై జరిగిన ప్రతి రిజిస్ట్రేషన్ను రద్దు చేసి,బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతు న్నారు. చిత్రిగడ్డలో జరుగుతున్న ఈ అక్రమ డబుల్ రిజిస్ట్రేషన్ల దందా నిజమా.? లేక ఆరోపణలకే పరిమితమా.? అనే విషయంపై అధి కారుల స్పందన కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిజం వెలుగులోకి రావాలం టే నిష్పక్షపాత విచారణ తప్పనిసరి చేయాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

పోలీస్ స్టేషన్ పేరువినిపించడమే కలవరానికి కారణం

సాధారణంగా అక్రమ రిజిస్ట్రేషన్లపై ఫిర్యాదులు అందితే చర్యలు తీసు కోవాల్సిన పోలీసుల పేరే ఈ వ్యవహారంలో వినిపించడంతో ప్రజల్లో భ యం, అనుమానం రెండూ పెరుగుతున్నాయి. ఫిర్యాదు చేస్తే కేసు ముందుకు వెళ్లకుండా స్టేషన్లోనే సెటిల్ చేస్తున్నా రంటూ కొందరు స్థానికులు ఆరోపి స్తున్నారు. నిజమైతే ఇది న్యాయ వ్యవ స్థకే సవాల్ చేసే విషయం అని పలువురు అభిప్రాయపడుతున్నారు.