25 April, 2026 | 3:55 AM

పదవి ఒకరిది.. పెత్తనం మరొకరిదా..?

25-04-2026 12:30 AM
  1. కాటా శ్రీనివాస్ గౌడ్‌ని తిట్టే స్థాయి గోవర్ధన్ రెడ్డిది కాదు..
  2. నీ పరిశ్రమ నుండి సీఎస్‌ఆర్ నిధులు ఇచ్చావా?
  3. గుమ్మడిదల నుండి కానుకుంట రోడ్డు తెచ్చింది కాంగ్రెస్..

గుమ్మడిదల, ఏప్రిల్ 24 : గుమ్మడిదల మున్సిపాలిటీ, మండలంలో పదవి ఒకరిది అయితే పెత్తనం మరొకరు చెలాయిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పుట్ట నర్సింగ్ రావు విమర్శించారు.  శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బిఆర్‌ఎస్ నాయకుడు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి మాట్లాడిన తీరును ఖండించారు. మొదటినుంచి గోవర్ధన్ రెడ్డి అధికారం చేపట్టకపోయినా పెత్తనం మాత్రం చెల్లాయించారని ఆరోపించారు.

చుట్టుపక్కల పరిశ్రమల నుండి అభివృద్ధి పనుల కోసం అంటూ సిఎస్‌ఆర్ ఫండ్స్ తెస్తున్నారని, నీ పరిశ్రమల నుండి ఎంత సిఎస్‌ఆర్ ఫండ్స్ ఇచ్చావని విమర్శించారు. కనీసం వార్డ్ నెంబర్ గా కూడా గెలవలేని గోవర్ధన్ రెడ్డి కాటా శ్రీనివాస్ గౌడ్ ను విమర్శించే స్థాయి లేదన్నారు. గతంలో 10 సంవత్సరాలు బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గుమ్మడిదల నుండి కానుకుంట రోడ్డు ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని నేడు కాంగ్రెస్ హయాంలో కాటా శ్రీనివాస్ గౌడ్  మంత్రి దామోదర్ రాజనర్సింహ దృష్టికి తీసుకువెళ్లగా మంత్రి చొరవతో రూ.7.20 కోట్లు విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటికైనా గోవర్ధన్ రెడ్డి తన పద్ధతి మార్చుకోవాలని సూచించారు.

ఈ సమావేశంలో కౌన్సిలర్ ముడిచింతల నరేందర్ రెడ్డి, బ్యాగరి కృష్ణవేణి, గోకరి నిర్మల, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దాసరి శ్రీకాంత్  రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ మద్ది వీరారెడ్డి, మాజీ ఎంపిటిసి గోవర్ధన్ గౌడ్, సర్పంచులు పెంటారెడ్డి, మైపాల్ రెడ్డి, నాయకులు మద్ది ప్రతాపరెడ్డి, మండలి తులసి దాస్, వినోద్ కుమార్, దర్గా వీరేష్ తదితరులు పాల్గొన్నారు.