13 May, 2026 | 10:00 PM

Breaking News

మల్లెపల్లి వడ్ల కేంద్రంలో భారీ కుంభకోణంలో సీబీసీఐడీ విచారణ చేపట్టాలి   •   బక్రీద్ కు ప్రత్యేక చర్యలు చేపట్టాలి   •   బోధన్ పట్టణంలో గంజాయి నేరస్తుడు పట్టివేత   •   గ్రామీణ రహదారుల నిర్మాణంతోనే నిజమైన అభివృద్ధి సాధ్యం: కూనంనేని   •   ఆత్మకూరులో ఘనంగా శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవం   •   గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేసిన జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు   •   సుల్తానాబాద్ కోర్టుకు హాజరైన బిజెపి నాయకులు   •   భూలక్ష్మి మహాలక్ష్మి అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలి   •   ప్రేమ పేరుతో యువతిని నమ్మించి మోసం చేసిన యువకుడు   •  

రెడ్లకుంటలో సాగునీటి కాలువ పునరుద్ధరణ పనుల ప్రారంభం

13-05-2026 08:43 PM

ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి చొరవ పట్ల రైతుల హర్షం

కోదాడ,(విజయక్రాంతి): కోదాడ మండలం, రెడ్లకుంట గ్రామంలోని ఎస్సీ మాన్యాల రైతులకు సాగునీటి కష్టాల నుండి విముక్తి కల్పిస్తూ ఎన్.హెచ్.పి కెనాల్ నుండి సాగునీటి కాలువ పునరుద్ధరణ పనులను సర్పంచ్ పోలంపల్లి కుటుంబరావు బుధవారం ప్రారంభించారు. సర్పంచ్ కుటుంబరావు మాట్లాడుతూ కోదాడ శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి ప్రత్యేక సహకారం, ఓ అండ్ ఎం కమిటీ నిధులతో ఈ పనులను చేపట్టామన్నారు.

రెడ్లకుంట గ్రామ అభివృద్ధిపై ఎమ్మెల్యే పద్మావతి రెడ్డికి ఉన్న ప్రత్యేక శ్రద్ధను కొనియాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా, చివరి భూములకు కూడా సాగునీరు అందాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ చూపి నిధులు మంజూరు చేయించారన్నారు. ఎస్సీ మాన్యాల కాలువ పూడికతీత, పునరుద్ధరణ పనుల వల్ల ఇక్కడి ఎస్సీ సోదరులైన రైతులందరికీ ఎంతో మేలు జరుగుతుందన్నారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్యను పరిష్కరించినందుకు గ్రామస్థులు, రైతులు ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు.