2 March, 2026 | 3:13 PM

అమెరికా మిత్రదేశాలపై ఇరాన్‌ క్షిపణుల వర్షం

02-03-2026 01:33 PM

అమెరికా మిత్రదేశాలపై ఇరాన్ క్షిపణుల వర్షం

అమెరికా ఎంబసీ లక్ష్యంగా ఇరాన్ మిస్సైల్స్

టెహ్రాన్ : ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ(Iran Supreme Leader Ali Khamenei) హత్యకు ప్రతీకారంగా మిడిల్ ఈస్ట్ లోని అమెరికా మిత్రదేశాలపై ఇరాన్ క్షిపణుల వర్షం(Iran missile attack) కురిపిస్తోంది. ఖతార్ రాజధాని దోహా, అబుదాబిలో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఇజ్రాయెల్ సహా అమెరికా మిత్రదేశాలపై ఇరాన్ దాడులకు పాల్పడుతోంది. కువైట్ లోని అమెరికా ఎంబసీ లక్ష్యంగా ఇరాన్ మిస్సైల్స్ ప్రయోగించింది.

అమెరికన్లు బయటకు రావొద్దని కార్యాలయం సిబ్బంది అప్రమత్తం చేశారు. కువైట్ లో మినా అల్ అహ్మది చమురు శుద్ధి కర్మాగారంపై(Mina Al-Ahmadi Refinery) దాడి చేసింది. మరోసారి బహ్రెయిన్ లోని యూఎస్ బేస్(Bahrain US base) ను ఇరాన్ క్షిపణ దెబ్బతీసింది. కువైట్ లో ఎఫ్ 15 యుద్ధ విమానం కూల్చిన వీడియోను ఇరాన్ షేర్  చేసింది. సౌదీలోని ఆరామ్ కో శుద్ధి కేంద్రంపై షహీద్-136 డ్రోన్లు విరుచుకుపడ్డాయి. సౌదీ అరేబియాపై ఇరాన్ డ్రోన్ల దాడి చేసింది.

సౌదీలోని అతిపెద్ద ఆయిల్ రిఫైనరీపై ఇరాన్ డ్రోన్లతో దాడికి పాల్పడింది. ఇరాన్ లోని అనేక నగరాలపై ఇజ్రాయెల్, అమెరికా(Israel, America) యుద్ధ విమానాలు విరుచుకుపడుతున్నాయి. సనన్ డాజ్ సిటీలోని పౌర నివాసాలపై దాడులు చేశాయి. పెంటగాన్ డిస్ట్రాయర్ నుంచి తొమహాక్ క్షిపణుల ప్రయోగించాయి. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధంతో దేశీయ స్టాక్ మార్కెట్ కుప్పకూలింది.పలు విమానయాన సర్వీసులు రద్దు అయ్యాయి. దేశవ్యాప్తంగా విమాన ప్రయాణికులు ఎయిర్ పోర్టులకు పరిమితమయ్యారు.