21 March, 2026 | 4:27 PM

యూఎస్-యూకే స్థావరంపై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో దాడి

21-03-2026 02:48 PM

అమెరికాకు హెచ్చరిక పంపిన ఇరాన్

4వేల కిలోమీటర్ల దూరంలో యూఎస్-యూకే స్థావరం

హిందూ మహాసముద్రానికి విస్తరించిన ఇరాన్-అమెరికా యుద్ధం 

టెహ్రాన్: ఇరాన్- అమెరికా యుద్ధం(Iran–America War) హిందూ మహాసముద్రానికి విస్తరించింది. చాగోస్ దీవుల్లోని అమెరికా- బ్రిటన్ సంయుక్త సైనిక స్థావరంపై ఇరాన్ దాడికి ప్రయత్నించింది. సైనిక స్థావరం డీగో గార్సియాపై 2 బాలిస్టిక్ క్షిపణులను ఇరాన్ ప్రయోగించింది. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు 'వాల్ స్ట్రీట్ జర్నల్' నివేదించారు.

ఇరాన్ ప్రయోగించిన క్షిపణి ఒకటి.. గాలిలోనే విఫలమైందని చెప్పారు. ఇరాన్ ప్రయోగించిన రెండో క్షిపణిని అమెరికా యుద్ధనౌక అడ్డుకుందని వివరించారు. ఇరాన్ భూభాగం నుంచి సుమారు 4 వేల కిలో మీటర్ల దూరంలో అమెరికా బేస్ ఉంది. ఐరోపాలోని లక్ష్యాలను కూడా తాకగలదనే హెచ్చరికను ఇరాన్ పంపంది. 22 రోజులుగా దాడులు, ప్రతి దాడులతో పశ్చిమాసియా అట్టుడుకుతున్న విషయం తెలిసిందే.