21 March, 2026 | 1:15 PM

Breaking News

రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం, డిప్యూటీ సీఎం   •   'శ్రమ మాది.. శిలాఫలకాలు మీవి'.. రిబ్బన్ కటింగ్ చేయడమే కాంగ్రెస్ పని   •   వేరే వ్యక్తిని పెండ్లి చేసుకుందని.. తండ్రితో వెళ్లి మహిళపై ప్రియుడు దాడి   •   యువకుడి ప్రాణం తీసిన పెళ్లి ప్రపోజల్‌.. పండగ పూట తీవ్ర విషాదం   •   కరీంనగర్ టూటౌన్ ఎస్ఐ ఆత్మహత్య.. అనాథలుగా మారిన చిన్నారులు   •   మార్కెట్‌లోకి 14 కోట్ల బ్యారళ్ల ఇరాన్ చమురు.. అమెరికా ఆంక్షలు ఎత్తివేత   •   హార్ముజ్ జలసంధి గురించి మాకు అవసరం లేదు.. వారికి ధైర్యం లేదు   •   కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధిగా బండారి గంగాధర్   •   నవోదయకు ఎంపికైన పోకల తనుష్   •   3 ట్రిలియన్ ఎకానమీ దిశగా ప్రణాళికలు!   •  

హార్ముజ్ జలసంధి గురించి మాకు అవసరం లేదు.. వారికి ధైర్యం లేదు

21-03-2026 11:36 AM
  1. కాల్పుల విరమణ చర్చలు అవసరం లేదు
  2. సైనిక పరంగా ఇరాన్ పని అయిపోయింది
  3. హోర్ముజ్ జలసంధి గురించి మాకు అవసరం లేదు
  4. నాటో సాయం చేయగలదు, కానీ ధైర్యం లేదు

వాషింగ్టన్: ఇరాన్ పై తమకు విజయం కావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) వెల్లడించారు. కాల్పుల విరమణపై చర్చలు జరపాలనుకోవడం లేదని తేల్చిచెప్పారు. ఖర్గ్ ద్వీపానికి(Kharg Island) సంబంధించి తమ వద్ద ఉన్న ప్రణాళికలు చెప్పలేనని తెలిపారు. ఇరాన్ నౌకాదళం, వైమానిక దళాన్ని నాశనం చేశామని పేర్కొన్నారు.

సైనిక పరంగా ఇరాన్ పని అయిపోయిందన్న ట్రంప్ ఇరాన్ ను తీవ్రంగా దెబ్బతీస్తున్నామని ప్రకటించారు. హోర్ముజ్ జలసంధి(Strait of Hormuz) గురించి తమకు అవసరం లేదని తెలిపారు. యూరప్, జపాన్, చైనా, కొరియాకు అవసరం కాబట్టి వారు జోక్యం చేసుకోవాలని స్పష్టం చేశారు. హోర్ముజ్ జలసంధి తెరిచేందుకు పెద్ద సంఖ్యలో నౌకలు అవసరమని చెప్పారు. హోర్ముజ్(Hormuz) ను తెరిచెందుకు నాటూ సాయం చేయగలదు, కానీ వారికి ధైర్యం లేదని ట్రంప్ వెల్లడించారు.