గల్ఫ్‌పై ఇరాన్ దాడి
- ఒమన్ ఇంధన టెర్మినల్‌లో భారీ పేలుడు
- నిలిచిన ముడిచమురు లోడింగ్
మస్కట్, జూన్ 5: పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధం ఉధృతం అవుతోంది. గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో భీకరదాడలు చేసింది. ఈ క్రమంలో ఒమన్‌లోని మినా అల్ ఫహల్ ఆయిల్ టెర్మినల్‌లో భారీ పేలుడు చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున అగ్నికీలలు చెలరేగడంతో అధికారులు అప్రమత్తమై ఫైరింజన్లతో మంటలను ఆర్పేశారు. ఇరాన్ డ్రోన్ దాడి కారణంగానే పేలుడు సంభవించి ఉండొచ్చనే అనుమానాలను అధికారులు వ్యక్తం చేశారు.
శుక్రవారం తెల్లవారుజామున ఆయి ల్ టెర్మినల్‌లోని రెండు సింగిల్ బాయ్ మూరింగ్ లోడింగ్ ప్లాట్‌ఫారమ్‌ల మధ్య ప్రాంతంలో ఈ పేలుడు సంభవించింది. దీంతో ఉదయం నుంచి చమురు లోడింగ్‌ను నిలిపివేశారు. సాయంత్రం 4 గంటల తరువాత చమురు లోడింగ్ కొనసాగుతుందని ‘పెట్రోలియం డెవలప్‌మెంట్ ఒమన్’ ఎక్స్ వేదికగా ప్రకటించింది. కార్యకలాపాలన్నీ కొనసాగుతున్నాయని సంస్థ కూడా తెలిపింది. ఈ పేలుడుపై ఆరా తీస్తున్నట్లు ప్రకటించారు.
ఉదయం నుంచి సాయంత్రం వరకు చమురు కోసం వచ్చిన వందలాది నౌకలు సముద్రంలో నిలిచిపోయాయి. మస్కట్ సమీపం లో ఉన్న ఈ టెర్మినల్ నుంచి ఒమన్ రోజుకు 8 లక్షల నుంచి 9 లక్షల బ్యారెళ్ల ముడిచమురును ఎగుమతి చేస్తుంది. మీనా అల్-ఫహల్ టెర్మినల్, ఒమన్ అత్యంత ముఖ్యమైన చము రు ఎగుమతి కేంద్రంగా ఉంది. ఈ టెర్మినల్‌లో ఏదైనా జరిగితే అది ముడిచమురు సర ఫరా, ప్రాంతీయ ఇంధన సరఫరాపై కూడా పడే అవకాశం ఉంది. మరోవైపు ఒమన్ సద్రంలోని అమెరికా సైనికనౌకను లక్ష్యంగా చేసుకున్నామని ఇరాన్ ప్రకటించింది.






