6 June, 2026 | 1:42 AM

అన్నామలై కొత్త పార్టీ!

06-06-2026 12:00 AM
  1. ప్రకటించిన తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు
  2. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని వెల్లడి
  3. సూపర్‌స్టార్ రజనీకాంత్ గతంలో నాకు ఆహ్వానం: అన్నామలై
  4. రాజీనామాకు బీజేపీ ఆమోదం

చెన్నై, జూన్ 5: మాజీ ఐపీఎస్ అధికారి, తమిళనాడు మాజీ అధ్యక్షుడు కే అన్నామలై కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని, కొత్త రాజకీయ ఉద్యమం చేయబోతున్నట్లు ఆయన తెలిపారు. భారతీయుడిగా, తమిళుడి గా గర్విస్తున్నానని, తన ఆలోచనలకు అనుగుణంగా ముందుకెళ్తానని స్పష్టం చేశారు. తమిళనాడు అభివృద్ధే తన ప్రథమ ప్రాధాన్యమన్నారు. అయితే తమిళగ మక్కల్ కళగం లేదా తమిళగ మక్కల్ కట్చి అనే పేరుతో పార్టీని స్థాపించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఆయన ‘వియ్ లీడర్స్’ అనే ట్రస్టును నిర్వహిస్తున్నారు. దీన్ని మరింత విస్తరించి రాజకీయ ఉద్యమంగా మార్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అన్నామలై శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఈ సమయంలో తమిళనాడు కు కొత్త పార్టీ అవసరమా? అని అడిగితే.. కచ్చితంగా అవసరమేనని, ఇప్పుడు ఎన్ని పార్టీలు ఉన్నా కూడా పార్టీ నాయకుడు ఎలాంటి వాడో ప్రజలు చూస్తున్నారని తెలిపారు.

పక్కం టి వాళ్లను చూసినట్లే ప్రజలు మమ్మల్ని చూడబోతున్నారని, దూరం నుంచి ప్రజలకు అభివాదం చేసే రాజకీయాలకు మే ము దూరం. కల్ట్ పాలిటిక్స్ నుంచి బయటకు రావాలి అం టూనే మళ్లీ అదే కల్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు. కామన్ మ్యాన్ పాలిటిక్స్ ముందుకు తీసుకొస్తనని చెప్పారు. కేవలం ముఖ్యమంత్రి కార ణంగా మార్పు సాధ్యం కాదని, సర్పంచ్ దగ్గరి నుంచి ముఖ్యమంత్రి వరకు అందరూ నిబద్ధత కలిగిన వాళ్లు ఉంటేనే మార్పు సాధ్యం అవుతుంది’ అని అన్నారు.

మార్పు కోసమే బీజేపీలో చేరానన్నారు. రాజీనామా ఆమోదించిన బీజేపీ హైకమాండ్‌కు ధన్యవాదాలు తెలిపారు. ప్రధా ని మోదీ అంటే తనకు గౌరవం ఉందన్నారు. అన్నామలై తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. తమిళనాడులో బీజేపీ ఒంటిరిగా పోటీ చేయాలని ఆశించాను. 18 నెలలుగా బీజేపీతో విభేదాలు ఉన్నాయి.

బీజేపీకి నేను భారంగా ఉండాలనుకోవడం లేదు. అందుకే బీజేపీకి రాజీనామా చేశా. 2025 డిసెంబర్ నెలలోనే అధిష్ఠానానికి తన రాజీనామా గురించి చెప్పా. అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యే వరకు పార్టీలో ఉన్నా అని వివరించారు. ఈ సందర్భంగా ప్రముఖనటుడు, సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రస్తావన తెచ్చారు. ఆయన తనతో చేతులు కలపమని గతంలో అడిగారన్నారు. 

2024లో తాను బీజేపీ లో చేరడానికి ఒకరోజు మందు రజనీకాంత్ తనకు ఫోన్‌చేశార ని, ఆయన నేతృత్వం వహిస్తున్న రాజకీయ ఉద్యమంలోకి రావాలని ఆహ్వానించారని చెప్పారు. కానీ తాను అప్పటికే బీజేపీ సీనియర్ నేత బీఎల్ సంతోష్‌కు మాటిచ్చానని, అందుకే రజనీ ఆఫర్‌ను సున్నితంగా తిరష్కరించానని వివరించారు.

ఆయన పార్టీ ప్రకట నతో ఇటీవలే ఎన్నికలు ముగిసిన తమిళనాడులో రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. ఇంతకా లం సీఎం విజయ్‌పై ఉన్న దృష్టి ఇప్పుడు అన్నామలై వైపు మళ్లింది. ఇదిలా ఉంటే బీజే పీ పార్టీ అన్నామలై రాజీనామాను శుక్రవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఆమోదించారు. అన్నామలై వెళ్లిపోవడం వల్ల పార్టీకి ఎలాంటి నష్టం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ వెల్లడించారు.