10 May, 2026 | 8:46 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

నేడే క్వాలిఫయర్-2 మ్యాచ్

01-06-2025 03:54 PM

బెంగళూరు: ఐపీఎల్-2025లో క్వాలిఫయర్-2 మ్యాచ్ ఆదివారం జరుగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఇవాళ రాత్రి 7.30 గంటలకు క్వాలిఫయర్-2లో ముంబై ఇండియన్స్ vs పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. గురువారం పంజాబ్ కింగ్స్ తో జరిగిన క్వాలిఫయర్-1లో రజత్ పాటిదార్ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 8 వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్ స్థానాన్ని దక్కించుకుంది. ఎల్లుండి అహ్మదాబాద్ వేదికగా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. 

ఆకు వెదర్ నివేదిక ప్రకారం... అహ్మదాబాద్ లో 34 డీగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని, అక్కడ వర్షం పడే అకాశాలు చాలా తక్కువగా ఉన్నట్లు సమాచారం. ఒక వేళ వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దయితే. పాయింట్ల పట్టికలో మెరుగ్గా ఉన్న పంజాబ్ జట్టే ముందుకు వెళ్తుంది. టాప్-4 రేసులో పంజాబ్ మొదటి స్థానంలోనూ.. ముంబాయి నాలుగో స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. దీంతో పంజాబ్ నేరుగా ఫైనల్ చేరుకుంటుంది. 

ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్లు ఆర్సీబీ బ్యాటింగ్ కోచ్ దినేష్ కార్తీక్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఫైనల్ లో ఆర్సీబీ స్థానం ఖరారు అయినప్పటికీ, వారు ఇంకా తమ ప్రత్యర్థి కోసం వేచి చూస్తున్నారు. ఈ రాత్రి ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగే క్వాలిఫయర్ 2 తర్వాత జూన్ 3న క్వాలిఫయర్ 2 విజేతతో ఆర్సీబీ తలపడుతుంది. ఇంతలో, ఐపీఎల్-2025 ప్రారంభానికి ముందు బ్యాటింగ్ కోచ్ గా నియమితుడైన దినేష్ కార్తీక్ పై మాజీ ఇంగ్లీష్ కెప్టెన్లు నాసర్ హుస్సేన్, మైఖేల్ అథర్టన్ విమర్శలు గుప్పించారు. ఆర్సీబీ టైటిల్ ను ఎత్తేయాలనే తన చిరకాల కలను ముగించినట్లయితే, 2012 ఛాంపియన్స్ లీగ్ ఫైనల్ తర్వాత మాజీ చెల్సి స్టార్ జాన్ టెర్రీ లాగానే దినేష్ కార్తీక్ ట్రోఫీ వేడుకల్లో ముందంజలో ఉంటాడని అథర్టన్ అన్నారు.