10 May, 2026 | 9:56 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

ఫైనల్ గడప తొక్కేదెవరో?

01-06-2025 12:50 AM

నేడు ముంబై, పంజాబ్ క్వాలిఫయర్

అహ్మదాబాద్, మే 31: ఐపీఎల్ 18వ సీజన్ తుదిదశకు చేరుకుంది. ఆదివారం క్వాలిఫయర్ ముంబై ఇండియన్స్‌తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు జూన్ 3న ఆర్సీబీతో ఫైనల్ ఆడనుంది. ఇప్పటి వరకు ఆర్సీబీ, పంజాబ్ జట్లు ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడలేదు.

కానీ ముంబై మా త్రం ఐదుసార్లు ట్రోఫీని కైవసం చేసుకుంది. నేడు జరిగే పోరులో పంజాబ్ గెలిస్తే కొత్త జట్టు ట్రోఫీని చేజిక్కించుకునేందుకు అ వకాశం ఉంటుంది.ఎలిమినేటర్ మ్యాచ్‌లో గుజరాత్‌ను మట్టికరిపించిన ముంబై ఆ త్మవిశ్వాసంతో ఉండగా..క్వాలిఫయర్ పేలవ ప్రదర్శనతో పంజాబ్ మాత్రం ఒత్తిడిలో ఉంది.