2 March, 2026 | 9:09 PM

8న అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభ

02-03-2026 07:35 PM

నిర్మల్,(విజయక్రాంతి): మార్చి 8న తుడుం దెబ్బ ఆధ్వర్యంలో కొమురం భీం జిల్లాలో నిర్వహించి అంతర్జాతీయ శ్రామిక మహాసభను జయప్రదం చేయాలని, తుడుం దెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకగారి భూమయ్య నాయకుల పిలుపు నిచ్చారు. సోమవారం నిర్మల్ లో మహాసభ పోస్టర్లను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఈ మహాసభకు పెద్ద ఎత్తున ఆదివాసులు తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సాకి లక్ష్మణ్, వర్కింగ్ ప్రెసిడెంట్ సుంచు శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి తుడసం గోవర్ధన్, జిల్లా సంయుక్త కార్యదర్శి సురపు సాయన్న, జిల్లా నాయకులు మంద మల్లేష్, లింగన్న, పోతురాజు శ్రీనివాస్, భీమేష్, రామకృష్ణ మరియు పెద్ద సంఖ్యలో ఆదివాసి మహిళలు పాల్గొన్నారు.