13 May, 2026 | 2:23 AM

నేటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

13-05-2026 01:31 AM

హాజరు కానున్న 3.98 లక్షల మంది విద్యార్థులు

హైదరాబాద్, మే 12 (విజయక్రాంతి): నేటి నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఈనెల 21 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, సెకండ్ ఇయర్ విద్యార్థులకు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు నిర్వహిస్తారు. పరీక్షల నిర్వహణకు రాష్ట్ర వ్యాప్తంగా 889 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. జనరల్, వొకేషనల్ కలిపి ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 2,67,271 మంది, సెకండ్ ఇయర్ విద్యార్థులు 1,31,063 మంది పరీక్షలకు హాజరు కానున్నారు.