13 May, 2026 | 2:24 AM

భద్రాచలం దేవస్థానం పాలకమండలి ఏర్పాటు ఎప్పుడూ?

13-05-2026 01:33 AM

తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేత శ్రావణ బోయిన నరసయ్య ముదిరాజ్ 

భద్రాద్రి కొత్తగూడెం, మే 12 (విజయక్రాంతి): భద్రాచలం దేవస్థానం పాలకమండలి ఏర్పాటు ఇంకా ఎన్నాళ్ళంటూ తెలంగాణ ఉద్యమ నేత శ్రావణ బోయిన నరసయ్య ముదిరాజ్ ఎద్దేవా చేశారు. 2024 డిసెంబర్ లో ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించి సంవత్సర కాలము గడిచిన పాలకమండలిని ఏర్పాటు చేయక ప్రజలను అవమానపరచి, వాటిని రద్దుచేసి తిరిగి 2025 డిసెంబర్ లో పాలకమండలి ఏర్పాటు కొరకు ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారని, ఆరు నెలల  గడిచిన ఇంతవరకు పాలకమండలికి ఏర్పాటు చేయక పోవడం పట్ల  తీవ్రంగా  మండిపడ్డారు.

ఇలా రెండు సంవత్సరాలుగా ప్రజలను అవమానపరచడం చాలా దురదృష్టకరం. తక్షణమే పాలకమండలిని ఏర్పాటు చేయాలని, అందులో రాష్ట్రం కోసం ప్రాణాలు ఎదురొడ్డిపోరాడిన ఉద్యమకారులకు ప్రథమస్థానం కల్పించాలన్నారు. భక్తిపరులను, సంఘ సేవకులను, నిజాయితీపరులను సభ్యులుగా నియమించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు నరాల సత్యనారాయణ కార్యదర్శి కాకెళ్లి సైమాన్ పిల్లి రాజయ్య ఖమ్మం లింగయ్య అలీముద్దీన్ గౌస్ తదితరులు పాల్గొన్నారు