13 May, 2026 | 2:23 AM

ఎడ్‌సెట్‌కు 82 శాతం మంది హాజరు

13-05-2026 01:30 AM

హైదరాబాద్, మే 12 (విజయక్రాంతి): టీజీ ఎడ్‌సెట్ ప్రవేశ పరీక్ష రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిందని అధికారులు తెలిపారు. ఈ పరీక్షకు మొత్తం 82.42 శాతం మంది హాజరయ్యారు. - తెలంగాణ రాష్ట్రంలోని బి.ఎడ్. కోర్సుల్లో 2026 విద్యా సంవత్సర ప్రవేశాల కోసం ఆన్‌లైన్ విధానంలో నిర్వహించిన ఎడ్‌సెట్ ప్రవేశ పరీక్ష మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా రెండు సెషన్లలో ప్రశాంతంగా ముగిసినట్లు కన్వీనర్ ప్రొఫెసర్ బీ వెంకట్రామరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి, కాకతీయ విశ్వవిద్యాలయ వైస్-చాన్సలర్ కె. ప్రతాప్ రెడ్డితో కలిసి ప్రశ్నాపత్రం (సెట్)ను ఎంపిక చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 35,600 మంది అభ్యర్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకోగా, వారిలో 29,342(82 శాతం) మంది పరీక్షకు హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి, వైస్-చైర్మన్ పురుషోత్తం, సెక్రటరీ శ్రీరామ్ వెంకటేశ్, వర్సిటీ వీసీ కె.ప్రతాప్ రెడ్డి పలు కేంద్రాలు సందర్శించారు.