24 May, 2026 | 1:03 AM

29న ఇంటర్ ఎన్విరాన్‌మెంట్ పరీక్ష

24-05-2026 12:20 AM

హైదరాబాద్, మే 23 (విజయక్రాంతి): బక్రీద్ పండుగ సెలవు దినాన్ని ప్రభుత్వం సవరించిన నేపథ్యంలో ఈనెల 28వ తేదీన జగరాల్సిన ఇంటర్ సప్లమెంటరీ ఎన్విరాన్‌మెంటల్ పరీక్షను ఈనెల 29న నిర్వహించ నున్నారు. ఈమేరకు ఇంటర్ బోర్డు పరీక్ష తేదీని రీషెడ్యూల్ చేస్తూ శనివారం ఒక ప్రకటనను విడుదల చేసింది. మిగిలిన పరీక్షల తేదీలు యథావిధిగా షెడ్యూల్ ప్రకారమే జరగనున్నట్లు తెలిపింది.