26 August, 2026 | 5:08 AM

అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

26-08-2026 12:52 AM

కుత్బుల్లాపూర్ డీసీపీ కోటిరెడ్డి

13 చోరీ కేసులు ఛేదించిన జీడిమెట్ల పోలీసులు, 

సైబరాబాద్ స్పెషల్ టీమ్స్

కుత్బుల్లాపూర్, ఆగష్టు 25 (విజయక్రాంతి): రాత్రి వేళల్లో మూసివున్న దుకాణాలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాకు చెందిన నలుగురు నిందితులను జీడిమెట్ల పోలీసులు, సైబరాబాద్ కమిషనరేట్ ప్రత్యేక బృందాలు అరెస్ట్ చేశాయి.

ఈ ముఠా కుత్బుల్లాపూర్ జోన్తో పాటు పరిసర ప్రాంతాల్లో చేసిన 13 చోరీ కేసులను పోలీసులు ఛేదించారు. వివరాలను కుత్బుల్లాపూ ర్ జోన్ డీసీపీ ఎన్. కోటి రెడ్డి, ఐపీఎస్ వెల్లడించారు. డీసీపీ ఎన్. కోటి రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఆగస్టు 5,6వ తేదీ అర్ధరాత్రి చింతల్ మెయిన్ రోడ్, గణేష్ నగర్లోని అయినాథ్ గ్లాస్ అండ్ ప్లై వుడ్ షాప్లో చోరీ జరిగింది. మూసివున్న దు కాణం షట్టర్ను పైకి లేపి కౌంటర్లో ఉన్న రూ. 80,000 నగదును దొంగిలించారు. దీనిపై జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సాంకేతిక, ఎలక్ట్రానిక్ ఆధారాలను విశ్లేషించిన పోలీసులు నిందితులను గుర్తించారు. చోరీ అనంతరం వారు రాజస్థా న్, గుజరాత్ వైపు పారిపోయినట్లు గుర్తించి ప్రత్యేక బృందాలను అక్కడికి పంపించారు. ఈ క్రమంలో రాజస్థాన్లోని బేవార్ జిల్లాలో హరి సింగ్ (30), చందన్ సింగ్ (28)లను, అహ్మదాబాద్లో లుంబ్ సింగ్ (29), మనోహ ర్ సింగ్ (20) లను పోలీసులు అ దుపులోకి తీసుకున్నారు. సంబంధిత కోర్టుల నుంచి ట్రాన్సిట్ వారెంట్లు పొందిన అనంతరం నిందితులను హైదరాబాద్కు తీసుకు వ చ్చి తదుపరి దర్యాప్తు కొనసాగించారు.

నిందితుల నేర పద్ధతి

నిందితులు ఒకరికొకరు పరిచయం ఉండటంతో ముఠాగా ఏర్పడి రాత్రి వేళల్లో మూసివున్న వాణిజ్య సంస్థలను లక్ష్యంగా చేసుకునేవారు. ముందుగా దుకాణాలను పరిశీలించి, రాత్రి సమయంలో మూసివున్న షాపులను గుర్తించేవారు. అనంతరం అక్కడికి చేరుకుని షట్టర్లను పైకి లేపి లేదా ప గులగొట్టి లోపలికి ప్రవేశించేవారు. కొందరు లోపల చోరీ చేస్తుండగా, మరికొందరు బయట కాపలా ఉండేవారు.

గండి మైసమ్మ, చింతల్, జీడిమెట్ల, నిజాంపేట్, దూలపల్లి, ప్రగతినగర్ తదితర ప్రాంతాల్లోని క్యాష్ కౌంటర్లు, ఎలక్ట్రికల్/హార్డ్వేర్ షాపులు, ప్లై వుడ్ దుకాణాలు, కిరాణా షాపులు, వస్త్ర దు కాణాలు తదితర వాణిజ్య సంస్థలను ఈ ముఠా లక్ష్యంగా చేసుకునేది.

దొంగిలించిన నగదు, చోరీ చేసిన వస్తువులను విక్రయించడం ద్వారా వచ్చిన మొత్తాన్ని నిందితులు పంచుకునేవారు. ఈ కేసుల ఛేదనలో కూకట్పల్లి సీసీఎస్ ఇన్స్పెక్టర్ జగదీష్, దుండిగల్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ జి. రమేష్ నాయుడు, వారి బృందాలు కీలకంగా పనిచేశాయి. అ ంతర్రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి నిందితులను పట్టుకోవడంలో కృషి చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని డీ సీపీ శ్రీ ఎన్. కోటి రెడ్డి అభినందించారు.

వాణిజ్య సంస్థల యజమానులకు పోలీసుల సూచనలు

దుకాణాలు, వాణిజ్య సంస్థల యజమానులు రాత్రి వేళల్లో భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సైబరాబాద్ పోలీసులు సూచించారు. దుకాణాల వద్ద రాత్రి సమయంలో కూడా స్పష్టంగా రికార్డు అయ్యేలా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి, అవి పనిచేస్తున్నాయో లేదో నిర్ధారించుకోవాలి. షట్టర్లు, తాళాలు, ఇతర భద్రతా ఏర్పాట్లను పటిష్టం చేసుకోవాలి. దుకాణాల చుట్టూ తగినంత లైటింగ్ ఉండేలా చూసుకోవాలి. రాత్రివేళల్లో దుకాణాల్లో పెద్ద మొత్తంలో నగదు ఉంచకూడదు. మూసివున్న దుకాణాల వద్ద అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాల కదలికలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని డీసీపీ సూచించారు.