అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
నిందితుడి దాడిలో పోలీసులకు గాయాలు
ఆత్మరక్షణలో పోలీసులు కాల్పులు
నిందితుడికి కాలికి గాయం..
వివరాలు వెల్లడించిన ఎస్పీ..
నల్లగొండ క్రైం, జులై 1: వరుస దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు సవాలుగా మారిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. నేర సంఘటన వివరాలను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ బుద వారం తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఏపీలోని నర్సాపురం భీమవరం స్టేషన్ పేటకు చెందిన బూస్మి శ్రీకాంత్ అలియాస్ అమ్మిరాజు, పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలంలోని అంజనీ పురానికి చెందిన వేల్పుల ఆతేంద్ర అలియాస్ అత్తిలిలు ఏపీ తెలంగాణలో దొంగతనాలకు పాల్పడుతున్నారు.
పక్కా సమాచారంతో ఓ ఆర్ ఆర్ వద్ద నిఘా వేసి నాగార్జునసాగర్ వైఫ్ నుండి డీసీఎం లో హైదరాబాద్ వైపు వస్తున్న నిందితులను పట్టుకునే క్రమంలో ఇనుప రాడ్, కత్తితో పోలీసులపై దాడి చేయడంతో ఒక హెడ్ కానిస్టేబుల్ విష్ణువర్ధన్ గిరి గాయపడగా, ఆత్మరక్షణలో పోలీసులు గాలిలో హెచ్చరిక కాల్పులు జరిపి, అనంతరం నిందితుడు బూస్మి శ్రీకాంత్ కాళ్లపై కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు.
గాయపడ్డ కానిస్టేబుల్ కు, నేరస్థునికి చికిత్స చేయించినట్లు తెలిపారు. రెండు రాష్ట్రాల్లో అనేక చోరీలకు పాల్పడ్డారని, నర్సాపురంలో ఒక టీచర్ హత్య కేసులో ఉన్నట్లు, శ్రీకాంత్ పై గతంలో 30 పైగా కేసులు ఉన్నాయని, నల్గొండ జిల్లాలో మూడు కేసులో నీరసంగా ఉన్నట్లు గుర్తించామని మరోసారి కష్టానికి తీసుకొని విచారిస్తామన్నారు.
నిందితుడిని సమర్థవంతంగా పట్టుకున్న సీసీఎస్ ఇన్స్పెక్టర్ జితేందర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, మిర్యా ల్గూడ రూరల్ ఇన్స్పెక్టర్ పి ఎన్ డి ప్రసాద్, ఎస్త్స్ర విజయ్ కుమార్, సిసిఎస్ సిబ్బంది హెచ్ సి లు విష్ణువర్ధనగిరి, పుష్పగిరి, నాగరాజు, వహీద్ పాష, ఫయాజ్, శివరాజ్, నరేష్, ,గులాందస్తగిరి, కమల్ కిషోర్, సా యి, జునైద్, ఆశ్రర్ లను ఎస్పీ అభినందించి నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలు ప్రకటించారు.






