25 February, 2026 | 4:43 AM

నేటి నుంచి ఇంటర్ పరీక్షలు

25-02-2026 01:20 AM

ఉమ్మడి మెదక్ జిల్లాలో 124 పరీక్షా కేంద్రాలు 

పరీక్షలకు హాజరుకానున్న 68,355 మంది విద్యార్థులు

పరీక్షా కేంద్రాల వద్ద 163 BNSS (144)సెక్షన్ అమలు...

సంగారెడ్డి/మెదక్/సిద్దిపేట, ఫిబ్రవరి 24(విజయక్రాంతి): ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కాను న్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో 124 కేం ద్రాల్లో పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యా హ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులను 30 నిమిషాల ముందు నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు.

సరిగ్గా తొమ్మిది గంటలకు గేట్లు మూ సివేసారు. అయితే ఈ సారి 5 నిమిషాలు ఆలస్యమైనా లోపలికి అనుమతించనున్నా రు. కాగా జనరల్, ఓకేషనల్ కలిపి మొత్తం 68,355 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో ప్రథమ సంవత్సరం విద్యార్థులు 34,017 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 34,338 మంది ఉన్నారు.

పరీక్షా కేంద్రాల్లోకి సెల్ఫోన్లు, ఇతరత్రా ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు. కేంద్రాల్లో విధులు నిర్వహించే ఇన్విజిలేటర్లు, ఇతర సిబ్బంది కూడా సెల్ఫోన్లను పరీక్ష కేం ద్రాల ప్రాంగణంలో వినియోగించకుండా ఆంక్షలు విధించారు. పరీక్ష కేంద్ర చీఫ్ సూపరింటెండెంట్, డిపార్టుమెంట్ ఆఫీసర్లు మాత్రమే ఇంటర్ బోర్డు అందించిన కీప్యాడ్ సెల్ఫోన్ను వినియోగించాలి.

పరీక్షా కేంద్రాల వద్ద 163 BNSS (144)సెక్షన్ అమలు... 

ఉమ్మడి జిల్లాలో బుధవారం నుంచి జరి గే ఇంటర్మీడియట్ రాత పరీక్షలు ప్రశాంతం గా నిర్వహించేలా అధికారులు దృష్టి సారించారు. ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు సంబంధించి పోలీస్ అధికారులు నిర్వహించాల్సిన విధుల గురించి ఇప్పటికే ఆయా జిల్లాల ఎస్పీలు తెలియజేశారు. విద్యార్థులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ఠ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు.

పరీక్ష మొద లైనప్పటి నుంచి పూర్తయ్యే వరకు అధికారులు, సిబ్బంది అంతా అప్రమత్తంగా విధు లు నిర్వహించాలన్నారు. పరీక్షా కేంద్రాల వ ద్ద 144 సెక్షన్ అమలు చేయాలన్నారు. విద్యార్థులను సెల్ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, ఎలక్రా్టనిక్ పరికరాలతో పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరాదన్నారు. పరీక్షా కేంద్రాల చుట్టుపక్కల ఉన్న జిరాక్స్ షాపులను మూసి వేయించాలన్నారు.

హాల్ టికెట్లపై QR కోడ్ ...

పరీక్షలు రాసే విద్యార్దుల కోసం ఈ సారి రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా హాల్ టిక్కెట్ పైన Q R కోడ్ ఏర్పాటు చేశారని... తద్వారా ఆ కోడ్ ను స్కాన్ చేస్తే సంబంధిత పరీక్ష కేంద్రాల వివరాలను (లోకేషన్) తెలుపుతుంది. అలాగే పరీక్షల సమయంలో విద్యార్దులు మానసికంగా ఒత్తిడికి గురైతే, ఒత్తిడిని తట్టుకొని ప్రశాంతంగా పరీక్షలు వ్రాసే విధంగా టేలి మానస్ నెంః 14416 కి ఫోన్ చేస్తే నిపుణులు కౌన్సిలింగ్ ఇవ్వనున్నారు. పరీక్షా కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించనున్నారు.

ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా పరీక్షలు సజావుగా కొనసాగేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. పరీక్షలు సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగకుండా, నిరంతరం వి ద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు, అలాగే పరీక్ష కేంద్రాల వద్ద ఉచిత వైద్య శిభిరాలను ఏర్పాటు చేసి, తగినన్ని మందులు నిల్వ పెట్టాలని వైద్య అధికారులకు సూచించారు.

అవసరమైన పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేయాలని పోలీస్ శాఖను, పరీక్షా కేంద్రాల వద్ద 163 BNS సెక్షన్ ఏర్పాటు చేయాలని, అలాగే పరీక్షలు కేంద్రాల సమీపంలో జిరాక్స్ షాపులను మూసి ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు, వేసవి దృ ష్టిలో పెట్టుకుని నాణ్యమైన త్రాగునీరు సమకూర్చి, కేంద్రాల పరసర ప్రాంతాల్లో పారిశు ద్య్ద కార్యక్రమాలు చేపట్టాలని సంబంధిత అ ధికారులకు సూచించారు. అలాగే జవాబు ప త్రాలను పగడ్బందీగా తీసుకువెళ్లేందుకు పోస్టల్ శాఖ, పోలీసు శాఖలు సమన్వయం తో వ్యవహరించి, పరీక్షలు విజయవంతంగా నిర్వహించాలని అన్నారు.

వివిధ ప్రాంతాలనుండి వచ్చే విద్యార్థులు సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా ప్రత్యేక ఆర్టిసి బ స్సులను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను ఆయన ఆదేశించారు. గతంలో ఎ లాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్షలను సజావుగా, ప్రశాంతంగా నిర్వహించామని... ఈసారి కూడా జాగ్రత్తగా వ్యవహరించాలని,  పరీక్షలను విజయవంతం చేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని అధికారులకు సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద నిబందనల మేరకు 163 BNS సెక్షన్ ఏర్పాటు తో పాటు ప్రశ్న పత్రాలు పరీక్ష కేంద్రాలకు తీసుకొని వెళ్లె సమయంలో బందొబస్తు ఏర్పాటు చేయుటకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.