26 May, 2026 | 4:21 PM

Breaking News

ప్రభుత్వ ఏర్పడ్డ రెండు సంవత్సరాలకె ఆడ బిడ్డలు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడినది   •   బాల్యవివాహాలను నిర్మూలించాలి   •   మంథనిలో రేపు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం విజయవంతం చేయాలి   •   కొనుగోలు కేంద్రం ప్రారంభించిన తాసిల్దార్   •   వర్షాకాలం ప్రారంభంలోగా పనులు పూర్తి చేయాలి   •   కోమాలో ఉన్న లాలును పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే తాటి   •   క్యాన్సర్ ను ప్రారంభ దశలో గుర్తించి శస్త్రచికిత్స చేస్తే.. ప్రమాదాలు తగ్గించవచ్చు..   •   పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు పెంచాలి: సీఐటీయూ   •   గుడిసె వాసుల జాబితాను సిద్ధం చేయండి: ఎంపీడీవో   •   వైభవంగా అయ్యప్ప స్వామి పుట్టినరోజు వేడుకలు   •  

పోలీసుల ఆధ్వర్యంలో అర్థరాత్రి ముమ్మర తనిఖీలు

26-05-2026 03:38 PM

మఠంపల్లి మే 26(విజయక్రాంతి): మండల పరిధిలోని భీమ్లా తండా గ్రామంలో ఎస్సై ప్రవీణ్ కుమార్(SI Praveen Kumar) పోలీసు సిబ్బందితో కలిసి సోమవారం అర్ధ రాత్రి వేళ ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు భద్రత కల్పించడమే లక్ష్యంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.అనంతరం గ్రామస్తులకు భద్రత తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ప్రజలకు భద్రత కల్పించడంలో పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని ఏవైనా సమస్యలు ఉంటే సామరస్యంగా లేదా చట్టపరంగా పరిష్కరించుకోవాలని ప్రజలకు సూచించారు.

భూ తగాదాల విషయంలో భౌతిక దాడులకు పాల్పడకుండా పెద్దల సమక్షంలో,కోర్టుల ద్వారా పరిష్కారం పొందాలని కోరారు.గ్రామాల్లోకి అనుమానిత వ్యక్తులు ప్రవేశిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. వ్యవసాయ సీజన్ ప్రారంభం కావడంతో రైతులు నకిలీ విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని,మధ్యవర్తుల వద్ద విత్తనాలు కొని మోసపోవద్దని సూచించారు.అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100కు ఫోన్ చేస్తే ఇంటి వద్దకే వచ్చి పోలీసింగ్ సేవలు అందిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ నాగు నాయక్,ఉప సర్పంచ్ జామ నాయక్, వార్డ్ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.