calender_icon.png 19 February, 2026 | 4:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీశ్రీ భూ సమేత తిరుమలనాథ స్వామి దేవాలయంపై శంకు చక్రాల స్థాపన

18-02-2026 09:50:02 PM

చిట్యాల,(విజయక్రాంతి): పెద్ద కాపర్తి గ్రామంలో శ్రీశ్రీశ్రీ భూ సమేత తిరుమలనాథ స్వామి దేవాలయంపై శంకు చక్రాల స్థాపన కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన హోమంలో సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షుడు కాటం వెంకటేశం దంపతులు బుధవారం పాల్గొన్నారు. చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో శ్రీ శ్రీ భూ సమేత తిరుమలనాథ స్వామి కళ్యాణ మహోత్సవం ఈ నెల 26న ఘనంగా నిర్వహిస్తున్నామని, 27న రథోత్సవ కార్యక్రమం ఉంటుందని ఆయన తెలిపారు.

శ్రీశ్రీ భూ సమేత తిరుమనాథ స్వామి దేవాలయంపై శంకు చక్రాల స్థాపన కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన హోమం, పూజా కార్యక్రమాలలో శంకు చక్రాల దాత  సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కాటం వెంకటేశం పద్మ యాదవ్ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. హోమం కార్యక్రమంలో పాల్గొన్న గుడి చైర్మన్ ఓర్సు రాజకుమార్ దంపతులు, ఉరుమడ్ల సర్పంచ్ సాగర్ల బిక్షం భాను శ్రీ, చిన్నకాపర్తి సర్పంచ్ ఆవుల సుందర్,

పిట్టంపల్లి సర్పంచ్ అందే రాములు యాదమ్మ, తాళ్ల వెల్లంల సర్పంచ్ జోగు సురేష్, మాజీ ముద్దసాని నీత రమణారెడ్డి, ఉప సర్పంచ్ ఓరుసు సైదులు, డైరెక్టర్లు ఏర్పుల యాదమ్మ, నరసింహ చలమల్ల, మసూద్ రెడ్డి, జిల్లా నరసింహ, వార్డు సభ్యులు ఏర్పులకురు యాదయ్య, సాగర్ల నవ్య శ్రీ నాగరాజు, మర్రి హరీష్ రెడ్డి, జిల్లా ప్రశాంత్, ఏదుల అజిత్ రెడ్డి, తెలుసూరి సైదులు, నూతి వెంకటేశం, డాక్టర్ కిరణ్ ముఖ్య నాయకులు, భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.