24 April, 2026 | 6:25 PM

Breaking News

విశారదన్ మహారాజ్ ముందస్తు అరెస్ట్   •   పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది   •   వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్   •   బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింత మృతి   •   నిర్మల్‌లో ఆర్టీసీ కార్మికుల మౌన ర్యాలీ   •   కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి: సర్పంచ్ మందుల నాగయ్య   •   ఇంటి ఆవరణ పరిశుభ్రతే... దోమల నివారణకు ఉత్తమ మార్గం   •   బిచ్కుంద మున్సిపాలిటీలో కో ఆప్షన్ సభ్యుల ఎంపిక నోటిఫికేషన్ విడుదల   •   అర్హులైన వారికి అక్రిడేషన్ కార్డులు: జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్   •  

చర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అట్టహాసంగా వార్షికోత్సవం

18-02-2026 09:46 PM

ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు

చర్ల,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వార్షికోత్సవం బుధవారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ... విద్యార్థి దశ నుంచే స్పష్టమైన లక్ష్యాన్ని కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తోందని, ప్రభుత్వ కళాశాలల్లో నైపుణ్యం కలిగిన అధ్యాపకులు, మెరుగైన వసతులు ఉన్నాయని కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ కళాశాలను పనిచేస్తున్నాయని గుర్తుచేశారు.

విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తెల్లం వెంకట్రావు అనుభవాలను రంగరిస్తూ సుమారు రోజుకు 17 గంటలు కష్టపడి చదివి డాక్టర్ వృత్తి  సాధించారని , విద్యార్థులు చర్ల ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే జానపద గీతాలకు విద్యార్థులు వేసిన స్టెప్పులు అలరించాయి.

దేశభక్తిని చాటిచెప్పే ప్రదర్శనలు అందరిలో స్ఫూర్తిని నింపాయి.బహుమతుల ప్రధానం విద్యా సంవత్సరం పొడవునా విద్య, ఆటపాటల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల  ప్రథా నాచార్యులు నరేందర్ అధ్యక్షతన జరిగిన సభలో జిల్లా ఇంటర్మీడియట్ విద్య అధికారి వెంకటేశ్వర రావు,  సర్పంచ్ పూజారి సామ్రాజ్యం, ఉప సర్పంచి కృష్ణార్జునరావు, సులోచనా రాణి, ఎంపీడీవో ఈదయ్య, ఎంఈఓ పివి రమణ, కృష్ణవేణి, అధ్యాపకులు  స్థానిక ప్రజా ప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు