ఘనంగా భూలక్ష్మి మహాలక్ష్మి బొడ్రాయి దేవతల ప్రతిష్టాపన
ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే విజయ రమణారావు
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని 8వ వార్డు అశోక్ నగర్‌లో భూలక్ష్మి, మహాలక్ష్మి బొడ్రాయి దేవతల ప్రతిష్టాపన కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొని దేవతల ఆశీర్వాదాలు పొందారు.
ఈ సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మాట్లాడుతూ... గ్రామాల్లో బొడ్రాయి దేవతల ప్రతిష్టాపన వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో ఐక్యత, సాంప్రదాయ విలువలను పెంపొందిస్తాయని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు గ్రామాలలో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొల్పడానికి దోహదపడతాయని పేర్కొన్నారు.
భూలక్ష్మి, మహాలక్ష్మి దేవతల కృపతో పట్టణ ప్రజలు సుఖసంతోషాలతో, ఐశ్వర్యంతో ఉండాలని కోరుకుంటూ, అందరికీ దేవతల ఆశీస్సులు లభించాలని ఆకాంక్షించారు. భక్తి భావంతో నిర్వహించిన ఈ కార్యక్రమం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ, శ్రీగిరి శ్రీనివాస్, 8వ వార్డు కౌన్సిలర్ చింతల రాజు,గంగపుత్ర సంఘ సభ్యులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




