1 August, 2026 | 6:59 PM

Breaking News

కేరళ గ్లోబల్ హై స్కూల్ ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగ   •   ప్రస్తుత పరిస్థితులలో విద్యార్థిని, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి   •   సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ పోస్టర్ ఆవిష్కరణ   •   ఊర పండుగ బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ   •   చిట్టాపూర్‌లో మహిళా గ్రామసభ   •   నిజాయతీ చాటుకున్న వ్యాపారికి సామాజిక కార్యకర్త ఘన సన్మానం   •   పుట్టిన బిడ్డకు తల్లిపాలే మొట్ట మొదటి టీకా   •   గ్రామాభివృద్ధికి ప్రజల భాగస్వామ్యమే లక్ష్యం   •   ఆలేరు రెవెన్యూ డివిజన్ సాధనకు నా వంతు కృషి చేస్తా: ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య   •   వికలాంగులకు అన్నదానం చేసిన తాటిపల్లి భూపతి   •  

పూడూర్‌లో యాదవ సంఘాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మల్లారెడ్డి

18-05-2026 12:27 AM

మేడ్చల్ అర్బన్, మే 17 (విజయక్రాంతి): పూడూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన  శ్రీ కృష్ణ యాదవ సంఘం భవనాన్ని మాజీమంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదవులు నీతి,నిజాయితీగా ఉంటారని,నమ్మిన వారికి ఎల్లవేళలా అండగా నిలుస్తారని తెలిపారు. తాను గతంలో యాదవ సంఘం భవన నిర్మాణానికి  ఆర్థిక సాయం అందించగా  సద్వినియోగం చేసుకుని సంఘం  భవనాన్ని నిర్మించుకోవడం సంతోషకరం అన్నారు.

యాదవ సంఘం అధ్యక్షులు లక్ష్మణ్ యాదవ్ మాట్లాడుతూ గ్రామంలో యాదవులు భవనం లేక ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే మల్లారెడ్డి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించారని, ఎమ్మెల్యే సహకారంతో నూతన యాదవ సంఘం భవనాన్ని నిర్మించామని తెలిపారు. అడిగిన వెంటనే ఆర్థిక సాయం అందించి అన్ని వర్గాల అభ్యన్నతికి పాటు పడుతున్న ఎమ్మెల్యే మల్లారెడ్డికి దన్యవాదాలు తెలిపారు.

కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా గ్రంథాలయాల మాజీ చైర్మెన్ భాస్కర్యాదవ్, ఎల్లంపేట్ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీదేవి, గ్రామ మాజీ సర్పంచ్ బాబుయాదవ్, మాజీ కో ఆప్షన్ సభ్ములు నవీన్రెడ్డి, కౌన్సిలర్ నిశితా, బీఆర్‌ఎస్ నాయకులు పోచంపల్లి మాజీ సర్పంచ్ శ్రీనివాస్రెడ్డి, దయానంద్ యాదవ్, సుదర్శన్, బాలు, రఘుపతిరెడ్డి, హరత్రెడ్డి, గోపానీ వెంకటేష్ గ్రామ నాయకులు పోచయ్య, సత్తిరెడ్డి, కోల్ల వెంకటేశ్, క్రిష్ణ, సోమేశ్యాదవ్, హన్మంత్రెడ్డి, శశికుమార్, శ్రీకాంత్, యాదవ సంఘం సభ్యులు శ్రీశైలం యాదవ్, సాయికుమార్, వేణుయాదవ్, వెంకటేశ్, సుదర్శన్, క్రిష్ణ, మహేశ్, మల్లేశ్, తదితరులు పాల్గొన్నారు.