18 May, 2026 | 1:28 AM

బొడ్రాయి పూజలో పాల్గొన్నమాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి

18-05-2026 12:27 AM

ఘట్ కేసర్, మే 17 (విజయకాంతి) : ఘట్ కేసర్ పట్టణంలో ఆదివారం జరిగిన బొడ్రాయి పండగ 2వ వార్షికోత్సవంలో మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణ ప్రజలు ఉదయం నుండి సాయంత్రం వరకు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు వెంటరాగ నైవేద్యంతో కూడిన బోనాలతో బొడ్రాయి వద్దకు చేరుకొని సమర్పించి ముక్కులు తీర్చుకున్నారు. 

ఈకార్యక్రమంలో ఘట్కేసర్ మున్సిపల్ మాజీ చైర్మన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, వైస్ చైర్మన్ లు పలుగుల మాధవరెడ్డి, రెడ్యానాయక్, ఘట్కేసర్ రైతు సహకార సంఘం మాజీ చైర్మన్ సార శ్రీనివాస్ గౌడ్, డొంకెని బిక్షపతి గౌడ్, జేఏసీ కన్వీనర్ మారం లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీటీసీ మేకల నర్సింగ్ రావు, మాజీ కౌన్సిలర్లు చందుపట్ల వెంకటరెడ్డి, కొమ్మగోని రమాదేవి మహిపాల్ గౌడ్, బండారి ఆంజనేయులు గౌడ్, నాయకులు నాగులపల్లి రమేష్, బద్దం జగన్మోహన్ రెడ్డి, పల్లె విజయ్ గౌడ్, రొడ్డ యాదగిరి, ఎర్రోళ్ల సత్యనారాయణ, కందకట్ల రాధాకృష్ణారెడ్డి, వరికుప్పల లింగస్వామి. పోత్నకని మల్లికార్జునరాజు, ఎజ్జల రఘు, మేకల సునీల్ కుమార్, ఎండి సిరాజ్, పెద్ద సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు.