21 April, 2026 | 9:57 PM

మొగిలిపేటలో ఎరువుల దుకాణాల తనిఖీలు

21-04-2026 08:31 PM

మల్లాపూర్,(విజయక్రాంతి): మల్లాపూర్ మండలంలోని మొగిలిపేట గ్రామంలో ఎరువుల దుకాణాలను జిల్లా డివిజనల్ టాస్క్ ఫోర్స్ బృందం అధికారులు రాజుల నాయుడు, దండ రమేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఈ-పాస్ మిషన్, ఎరువుల నిల్వలు, స్టాక్ రికార్డులు, విక్రయ బిల్లులు తదితర వివరాలను పరిశీలించారు. యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఎరువుల విక్రయాలు నిర్వహించాలని సూచించారు. ముఖ్యంగా యూరియాను వ్యవసాయేతర అవసరాలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో మల్లాపూర్ వ్యవసాయ అధికారి లావణ్య పాల్గొన్నారు.