21 April, 2026 | 9:53 PM

ప్రగతి ప్రణాళికలో ప్రజల భాగస్వామ్యం

21-04-2026 08:29 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో నిర్మల్ భైంసా ఖానాపూర్ మున్సిపల్ తో పాటు, 400 గ్రామపంచాయతీలో 99 రోజుల పల్లె పాలన ప్రగతి ప్రణాళికలు ప్రజలు మేధావులు భాగస్వామ్యం కావాలని జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ బి.వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. కలెక్టర్ ఆదేశాల మేరకు విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ప్రతిరోజు పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. గ్రామాల్లో నర్సరీల ఏర్పాటు మురికి కాలువల శుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలిపారు. వేసవికాలంలో నీటి ఎద్దడి లేకుండా  చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా గ్రామపంచాయతీ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది ప్రజల భాగస్వామ్యంతో 99 రోజుల కార్యచరణ విజయవంత చేసినందుకు కష్టపడి పని చేయాలని సూచించారు.