5 June, 2026 | 6:06 PM

Breaking News

ఖానాపూర్లో కోర్టు నిర్మాణానికి స్థలం పరిశీలించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి   •   రైతు సేవలో ముందుండాలి   •   ప్రభుత్వ విప్ సహకారంతో కుల సంఘాల అభివృద్ధి కి ప్రత్యేక కృషి/సర్పంచ్ గండి నారాయణ   •   నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ జిల్లా ఎస్సీ వింగ్ అధ్యక్షులుగా పాల్ కరుణాకర్   •   గ్రామాలు పచ్చదనంతో నిండి పోవాలి: జిల్లా పంచాయతీ అధికారి   •   జంగం సంక్షేమానికి కృషి   •   రాజ్యసభ అభ్యర్థిగా ఖర్గే నామినేషన్ దాఖలు   •   పుప్పాల‌గూడ‌లో హైడ్రా భారీ ఆప‌రేష‌న్‌   •   పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నీటి పారుదల రంగం నాశనం   •   “పెళ్లి వేడుకలో పచ్చని సంకల్పం… మొక్క నాటడంతో కొత్త జీవితానికి ఆరంభం”   •  

ఇందిరమ్మ ఇంటి పరిశీలన

05-06-2026 04:49 PM

సర్పంచ్ బెండారే కృష్ణాజీ

వాంకిడి,(విజయక్రాంతి): బంబార గ్రామపంచాయతీ పరిధిలోని మోహుర్లే తాను బాయికి మొదటి విడతలో మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తయింది. ఈ నేపథ్యంలో శుక్రవారం నిర్మాణం పూర్తయిన ఇంటిని గ్రామ సర్పంచ్ బెండారే కృష్ణాజీ, ఉపసర్పంచ్ సంతోష్, మాజీ ఉపసర్పంచ్ ప్రకాశ్ బోయిరే, గ్రామపంచాయతీ కార్యదర్శి దుర్గం ధర్మయ్యతో కలిసి ఆయన పరిశీలించారు.

ఇంటి నిర్మాణ పనుల నాణ్యతను పరిశీలించిన వారు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ గృహ పథకం ద్వారా పేద కుటుంబాలు సొంత ఇంటి కలను నెరవేర్చుకుంటున్నాయని తెలిపారు. లబ్ధిదారులు ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.