13 May, 2026 | 3:54 AM

విద్యుత్ ఏర్పాట్ల పరిశీలన

13-05-2026 12:00 AM

జయశంకర్ భూపాలపల్లి (మహబూబాబాద్) మే 12 (విజయక్రాం తి): సరస్వతి అంత్యపుష్కరాల నేపథ్యంలో విద్యుత్ ఏర్పాట్లను ఎన్పీడీసీఎల్ సిఎండి కర్నాటి వరుణ్ రెడ్డి మంగళవారం పరిశీలించారు. కాలేశ్వరం వద్ద జరుగుతున్న పుష్కరాల సందర్భంగా చేస్తున్న విద్యుత్ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. పనులన్నింటినీ ఈనెల 15లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

భక్తులకు ఎలాంటి ఇబ్బం దులు కలగకుండా, తాత్కాలిక విద్యు త్ లైన్‌లో స్ట్రీట్ లైటింగ్ ట్రాన్స్ఫార్మర్లు భద్రత చర్యలు నిరంతర విద్యుత్ సరఫరా కోసం తీసుకుంటున్న చర్యలపై అధికారులతో సమీ క్షించారు. అంతకుముందు ములుగు జిల్లాలో చేపట్టిన విద్యుత్ పనులను ఆయన పరిశీలించారు. తెలుగులో కొత్తగా నిర్మిస్తున్న డిపార్ట్మెంటల్ ఎస్ పి ఎం షెడ్ పనులను పరిశీలించా రు.

జూన్ నెలాఖరులోగా పనులు పూర్తి చేసి ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతు ప్రక్రియను వేగవంతం చేసి రోలింగ్ స్టాక్ పెంచుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే 33 కెవి కొత్త విద్యుత్ లైన్ పనులను పరిశీలించారు. అటవీ ప్రాంతం ద్వారా కర్లపల్లి సబ్ స్టేషన్ నుండి లింగాల కొత్త సబ్స్టేషన్ వరకు విద్యుత్ లైన్, పసర సెక్షన్ పరిధిలో నూతనంగా నిర్మిస్తున్న సెక్షన్ ఆఫీస్ పనుల పురోగతిని పరిశీలించారు.

గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ నాణ్యత మెరుగుపడటానికి, అంతరాయాలు లేకుండా విద్యుత్ సరఫరా చేయడానికి అభివృద్ధి పనులు దోహదపడతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీ ఈ రాజు చౌహాన్, ఎస్ ఈ బిక్షపతి, డి ఈ నాగేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.