13 May, 2026 | 3:01 AM

కమిషనరేట్ కార్యాలయంలో పోలీసు వాహనాల పాత విడిభాగాల వేలం

13-05-2026 12:00 AM

హనుమకొండ, మే 12 (విజయక్రాంతి): వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీసు వాహనాల పాత విడిభాగాలను ఈ నెల 15 తారీకు, శుక్రవారం రోజున వేలం వేయనున్నట్లు సీపీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. ప్రభుత్వ పోలీస్ వాహనాలకు సంబంధించి రిపేర్ చేయబడిన బ్యాటరీలు, టైర్లు, విడిభాగాలను వేలంలో అందుబా టులో ఉంచుతామని, ఆసక్తి గల వ్యక్తులు శుక్రవారం ఉదయం 10 గంటలకు కమిషరేట్ కార్యాలయంలోని మోటర్ ట్రాన్స్ఫోర్ట్ ఆపీస్ (యంటీవో)లో సంప్రదించాలన్నారు. మరిన్ని వివరాల కోసం 87126 85158, 9440242895,9949568320 నంబర్లకు సంప్రదించగలరని సీపీ తెలిపారు.