17 August, 2026 | 4:36 PM

కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ రద్దును కాంగ్రెస్ చేస్తున్న కుట్రను అడ్డుకోవాలి

17-08-2026 03:08 PM

నాగిరెడ్డిపేట్, ఆగస్టు 17 (విజయక్రాంతి): బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్ ఆదేశాల మేరకు, కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాన్ని నిలిపివేయడానికి చేస్తున్న అంశంపై నిరసిస్తూ నాగిరెడ్డిపేట్ మండలం బిఆర్ఎస్ నాయకులు మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై మండల అధ్యక్షులు గుర్రాల సిద్దయ్య ఆధ్వర్యంలో ధర్నా నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గుర్రాల సిద్దయ్య, నాయకులు మాట్లాడుతూ... కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయుటకు కుట్ర పండుతున్నందున అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. హైకోర్టు తీర్పు సాకుతో పేదింటి ఆడపిల్లల భరోసాను ఎత్తి వేసేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తుందనీ,కల్యాణ లక్ష్మి అంశంలో హైకోర్టులో కౌంటర్ వేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేసిందని మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గుర్రాల సిద్దయ్య వాపోయారు.

ముఖ్యమంత్రి, మంత్రుల అవినీతి అంశాల్లో కోట్ల రూపాయలు చెల్లించి ప్రైవేట్ లాయర్లను పెట్టుకునే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశంలో ఎందుకు కౌంటర్ వేయలేదని ప్రభుత్వానికి సవాళ్లు విసిరారు.హైకోర్టు తీర్పు పేరుతో కళ్యాణ లక్ష్మిని పూర్తిగా రద్దు చేసే ప్రయత్నం చేస్తుంది. తెలంగాణ ఆడబిడ్డలు వారి కుటుంబాల తరఫున బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని నిలదీస్తుందని మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గుర్రాల సిద్దయ్య నాయకులు తెలిపారు.

ఆడ బిడ్డలకు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చేందుకే పూర్తిగా కల్యాణ లక్ష్మిని ఎత్తివేసే కుట్ర చేస్తుందని తెలిపారు.కల్యాణ లక్ష్మి మరియు షాది ముబారక్ పథకం నిరంతరం కొనసాగించాలంటూ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.అనంతరం సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని నిరసన కార్యక్రమాన్ని విరమింప చేశారు.ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గుర్రాల సిద్దయ్య,సీనియర్ నాయకులు రాజిరెడ్డి, మోతే శ్రీనివాస్, హనుమంత్ రెడ్డి,శ్రీనివాస్, దుర్గారెడ్డి,ఫరీద్,నరేష్, మల్లేశం,యేసు,రవీందర్ శీను, గోపాల్పేట్,కన్నారెడ్డి,ధర్మ రెడ్డి గ్రామాల సర్పంచులు వంశీకృష్ణ గౌడ్,సాయిలు, గులపల్లి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.