23 July, 2026 | 1:25 AM

ఐదో తరగతి విద్యార్థుల వినూత్న జలచక్ర నమూనా ప్రదర్శన

23-07-2026 12:00 AM

గణపురం, జులై 22, (విజయ క్రాంతి) గ ణపురం మండల కేంద్రంలోని ఫ్రోబెల్ మో డల్ హై స్కూల్లో ఐదో తరగతి విద్యార్థులు జలచక్రంపై వినూత్న నమూనాను రూపొందించి ప్రదర్శించారు. పాఠశాల డైరెక్టర్ ల్యా దల్ల యాదగిరి గౌడ్ పర్యవేక్షణలో విద్యార్థులు ఆసక్తి, సృజనాత్మకతతో ఈ నమూనా ను తయారు చేశారు.

ఈ నమూనా ద్వారా నీరు ఆవిరై మేఘాలుగా మారి వర్షరూపం లో భూమిపైకి వచ్చి, తిరిగి నదులు, చెరువుల ద్వారా సముద్రాలకు చేరే ప్రక్రియను సులభంగా వివరించారు. ఆవిరీకరణ, సం ఘననం, వర్షపాతం, సేకరణ దశలను స్ప ష్టంగా చూపించారు.ఈ సందర్భంగా డైరెక్టర్ యాదగిరి విద్యార్థులను అభినందిస్తూ, ఇ లాంటి శాస్త్రీయ కార్యక్రమాలు విజ్ఞానాన్ని పెంపొందించి భవిష్యత్తుకు దోహదపడతాయని తెలిపారు.