30 June, 2026 | 3:09 AM

ఆర్యవైశ్యుల నైతిక విలువలలో ఆవిష్కరణలే ప్రధానమైనవి

30-06-2026 12:00 AM

ఏపీ పరిశ్రమలు, వాణిజ్యం, ఆహర శుద్ధి పరిశ్రమ శాఖ మంత్రి టీజీ భరత్ గుప్త

ముషీరాబాద్, జూన్ 29 (విజయక్రాం తి): ఆర్య వైశ్యుల నైతిక విలువలలో ఆవిష్కరణలే ప్రధానమైనవని, ఇవి యువ తరా లను సృజనాత్మకంగా ఆలోచించడానికి, వ్యవస్థాపకతలో సాహసాలు చేయడానికి ప్రోత్సహిస్తాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  పరిశ్రమలు, వాణిజ్యం, ఆహర శుద్ధి పరిశ్రమ శాఖ మంత్రి టిజి. భరత్ గుప్త అన్నారు.

ఆధునిక పరిశ్రమలు, ఇంక్యుబేషన్ కేంద్రాలు,  ఆవిష్కరణల హబ్లను స్థాపించడం ద్వారా, వర్ధమాన పారిశ్రామిక వేత్తలుగా అద్భుతమైన ఆలోచనలను అభివృద్ధి చేసి, వాటిని విజయవంతమైన వ్యాపారాలుగా మార్చడంలో సహాయపడుతాయని తెలిపారు.

హైదరాబాద్  మాదాపూర్ హైటెక్స్ నోవొటెల్ హోటల్ లో అఖిల భారత ఆర్య వైశ్య పారిశ్రామిక వేత్తల ఫోరమ్ జాతీయ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారమహోత్సవం కార్యక్రమానికి టీజి. భరత్ గుప్త ముఖ్య అతిథి, మాజీ ఎమ్యెల్యే గణేష్ బిగల, పసుపు బోర్డు ఎండి భవాని, సీఎం ఓ.ఎస్.డి వేము ల శ్రీనివాసులు, జీఎస్టీ కమీషనర్ సాయి కిషోర్, బీజేపీ అధికార ప్రతినిధి చికోటి ప్రవీణ్ కుమార్, టీపీసీసీ ప్రచార కార్యదర్శి  ఉప్పల శ్రీనివాస్, టీజీవోఏ అధ్యక్షులు కృష్ణ మూర్తి, రాష్ట్ర ప్రభుత్వ ఉప కార్యదర్శి లింగ మూర్తిలు గౌరవ అతిథులుగా హాజరయ్యా రు.

ఈ సందర్బంగా అఖిల భారత ఆర్య వై శ్య పారిశ్రామికవేతల ఫోరం నూతన జాతీ య అధ్యక్షులుగా భవాని సురేష్ చారుగుండ్ల. ఉపాధ్యక్షులుగా బాలకృష్ణ ఎర్రం,  ప్రధాన కార్యదర్శిగా అనిల్ కుమార్ పడకంటి, సంయుక్త కార్యదర్శిగా వంశీ నెలాం టి, కోశాధికారిగా శివ కుమార్ బొగ్గరితో సహా 47 మంది జాతీయ కార్యవర్గ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

అనం తరం టీజి. భరత్ జ్యోతిని వెలిగించి సభను ప్రారంభించి, ఫోరమ్ పారిశ్రామిక ప్రదర్శన లోగో, బ్రోచర్‌ను ఆవిష్కరించి  మాట్లాడుతూ ఆల్ ఇండియా ఆర్య వైశ్య ఇండ స్ట్రియలిస్ట్స్ ఫోరమ్ అనేది ఆర్య వైశ్య సమాజానికి చెందిన పారిశ్రామిక వేత్తలు, వ్యవ స్థాపకులు, వ్యాపార నాయకులను అనుసంధానించే ఒక జాతీయ వేదికగా ఏర్పడడం గర్వకారణం అని అన్నారు.

ఫోరం నూతన అధ్యక్షులు భవాని సురేష్ చారుగుండ్ల మా ట్లాడుతూ  దేశంలోని తయారీ రంగంలో శ్రేష్ఠతను, సాంకేతిక పురోగతిని,  సుస్థిర వ్యా పార వృద్ధిని సాధించడానికి కట్టుబడి ఉన్న పారిశ్రామిక వేత్తలు, వ్యవస్థాపకులు,  తదుపరి తరం నాయకులను ఒకచోట చేర్చే ఒక చైతన్యవంతమైన వేదిక అఖిల భారత ఆర్య వైశ్య పారిశ్రామిక వేత్తల ఫోరం అని తెలిపారు. కార్యక్రమంలో ఫోరమ్ పూర్వ అధ్య క్షులు, వివిధ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.