30 June, 2026 | 3:58 AM

రైతులకు అందుబాటులో పెట్రోల్, డీజిల్ పంపులు

30-06-2026 12:00 AM
  1. రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ 
  2. ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు

సుల్తానాబాద్, జూన్ 29 (విజయక్రాం తి): రైతులకు అందుబాటులో పెట్రోల్ డీజి ల్ పంపులు ఏర్పాటు చేయడంతో పాటు , రైతుల సంక్షేమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ పెద్దపీట వేస్తున్నారని  ప్రభుత్వ విప్ , పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు , సోమవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నీరుకుల్ల గ్రామంలో సహకార సంఘం ఆధ్వ ర్యంలో సహకార వారోత్సవాలలో భాగంగా గ్రామంలో నూతనంగా నిర్మాణం చేపట్టిన కన్స్యూమర్ ఫిల్లింగ్ స్టేషన్ (పెట్రోల్, డిజిల్ పంప్) ను విజయ రమణారావు ప్రారంభించారు, అంతకు ముందు గ్రామంలో దాదా పు 30 లక్షల రూపాయలతో చేసిన వివిధ అభివృద్ధి పనులు సిసి రోడ్లు, డ్రైనేజీలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు.

ముందుగా ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు, ఈ సందర్భంగా చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ వెంకటేశ్వర స్వామి  మెమొంటో అందజేసి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం జరిగిన సమావేశంలో  విజయ రమణ రా వు మాట్లాడుతూ... పెద్దపల్లి నియోజకవర్గంలో ఉన్న 14 సంఘాలలో 11 సంఘాల ను ఏకం చేసి ఎలిగేడు మండలం శివారులో పదిహేను వేల మెట్రిక్ టన్నుల గోదాముల నిర్మాణం చేపడుతున్నామన్నారు.

కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో విత్తన శుద్ధి కేంద్రంగా సుల్తానాబాద్ సొసైటీ ఎంపికైందని తెలిపారు. గతంలో అధికారంలో ఉన్న ప్రభు త్వం 10 సంవత్సరాల కాలంలో కేవలం 7 వేల మెట్రిక్ టన్నుల గోదాముల నిర్మాణం చేపట్టారని కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక 20వేల మెట్రిక్ టన్నుల గోదాముల పనులు ప్రారంభించామని మరో 14 వేల మెట్రిక్ టన్నుల గోదాముల నిర్మాణం చేపడుతున్నామని రాబోవు రెండు సంవత్సరాల కాలంలో నియోజకవర్గ వ్యాప్తంగా లక్ష పైన మెట్రిక్ టన్నుల గోదాముల నిర్మాణం

చేపట్టేందుకు కృషి చేస్తామని తెలిపారు.  సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సర్పంచ్ కాంపల్లి సతీష్ కుమార్, ఏఎంసీ చైర్మన్ ప్రకాష్ రావు, సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధా కృష్ణ, డిసిఓ శ్రీ మాల, ఉప సర్పంచ్ సతీష్, సీఈవో బూర్గు సంతోష్ కుమార్, గ్రామపంచాయతీ కార్యదర్శి సునీత సాగర్, మండలంలోని ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.