ఏయూలో ఇన్నోవేషన్ హ్యాకథాన్ ప్రారంభం
ఘట్ కేసర్,(విజయక్రాంతి): అనురాగ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో మైక్రోసాఫ్ట్ ఆజూర్ డెవలపర్ కమ్యూనిటీ(Azure Developers Community), రెస్కిల్ ఐఈఈఈ ఉమెన్స్ చాప్టర్ సహకారంతో నిర్వహిస్తున్న రెండు రోజుల ఇన్నోవేషన్ హ్యాకథాన్ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ డీన్ డాక్టర్ వి. విజయ్ కుమార్ ప్రసంగిస్తూ ఈవిద్యా సంవత్సరంలో స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్(School of Engineering)లో 14 హ్యాకథాన్ లు నిర్వహించబడినట్లు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో ఆవిష్కరణాత్మక ఆలోచన, సాంకేతిక నైపుణ్యాలు మరియు పరిశ్రమకు అవసరమైన సామర్థ్యాలను పెంపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు.
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్(Computer Science and Engineering) డీన్ డాక్టర్ జి. విష్ణుమూర్తి మాట్లాడుతూ హ్యాకథాన్ల ప్రాముఖ్యతను వివరించారు. గతంలో పాల్గొన్న విద్యార్థులు ఉపాధి అవకాశాలు, ప్రాజెక్ట్ అనుభవం, ఎలా లాభపడ్డారో తెలిపారు. మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు భార్గవ, శృతి కాకడే ముఖ్య అతిథులుగా పాల్గొని, విద్యార్థులు ఇన్నోవేషన్, హ్యాకథాన్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని సూచించారు. ప్రస్తుత సాంకేతిక ప్రపంచంలో ప్రాక్టికల్ నైపుణ్యాలు, క్లౌడ్ టెక్నాలజీ పరిజ్ఞానం సహకార ఆవిష్కరణ ఎంతో అవసరమని వారు తెలిపారు. ఈకార్యక్రమంలో డీన్ స్టూడెంట్ అఫైర్స్ ప్రొఫెసర్ వి. శ్రీనివాసరావు, గణితశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ కె. శివారెడ్డి, భౌతికశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఎం. శ్రీనివాస్ రెడ్డి, రసాయనశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ సవిత బెల్వాల్ పాల్గొన్నారు. కార్యక్రమాన్ని కన్వీనర్లు డాక్టర్ ఎస్. దీపిక, డాక్టర్ పి. రవీందర్ రావు, దుర్గా భావాని సమన్వయం చేశారు.




