2 March, 2026 | 1:32 PM

కాలువ నిండా తుంగ.. రైతుకు బెంగ

02-03-2026 12:21 PM

వాంకిడి,(విజయక్రాంతి)​: కుమురంభీం జలాశయం ఎడమ ప్రధాన కాలువ నిర్వహణను అధికారులు గాలికి వదిలేశారనడానికి ఈ చిత్రమే నిదర్శనంగా కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో పనులు ఏమాత్రం జరగకపోవడంతో కాలువ పొడవునా తుంగ భారీగా పెరిగి నీటి ప్రవాహానికి తీవ్ర అడ్డంకిగా మారింది. దీనివల్ల చివరి ఆయకట్టు పంటలకు నీరు అందడం కష్టంగా మారి రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కలుపు మొక్కలను తొలగించడంలో నీటి పారుదల శాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఇప్పటికైనా స్పందించి తుంగను తొలగించి యాసంగి పంటలకు ఇబ్బందులు లేకుండా చూడాలని స్థానిక రైతాంగం కోరుతోంది.