నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో పసిబిడ్డ మృతి
వైద్యుల నిర్లక్ష్యం వల్లే అంటూ కుటుంబ సభ్యుల ఆందోళన
పండుగ పూట విషాదం
నల్లగొండ టౌన్, ఆగస్టు 28: ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో పసిబిడ్డ మృతి చెందిందని ఆరోపిస్తూ బాధిత కు టుంబం శుక్రవారం ఆందోళనకు దిగింది. నల్లగొండ పట్టణం ఇందిరమ్మ కాలనీ మా మిళ్లగూడెంకు చెందిన కంభంపాటి కవిత (25) ప్రసవం కోసం గురువారం ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ కేంద్రంలో చేరారు.
నార్మల్ డెలివరీ అవుతుందని, బిడ్డ ఆరోగ్యంగా ఉందని వైద్యులు చెప్పారని కుటుంబ సభ్యు లు తెలిపారు. తెల్లవారేసరికి బేబీ హార్ట్ బీట్ సరిగా లేదని, అత్యవసరంగా ఆపరేషన్ చే యాలని వైద్యులు సూచించారు. ఆపరేషన్ చేసిన గంటలోనే బిడ్డ మృతి చెందిందని చె ప్పారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
నిన్నటి దాకా బిడ్డ బాగుందన్నారు.. డెలివరీ తర్వాత మృతి చెందడం ముమ్మాటికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. బిడ్డ మృ తికి కారణమేంటని ప్రశ్నిస్తూ ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. సర్జరీ చేసిన వై ద్యులు, సూపరింటెండెంట్ అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించారు.
పండుగ పూట కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రభుత్వ ఆసుపత్రులపై, జిల్లా కలెక్టర్, వైద్య అధికారులు దృష్టి సా రించి పేదలకు భరోసా కల్పించాలని కోరుతున్నారు. ప్రైవేట్ ఆస్పత్రిలో భరోసా ఉండ దని ఆర్థిక దోపిడీ ఉంటదని, ఠాగూర్ సిని మా చూపిస్తారని.. ప్రభుత్వ ఆసుపత్రిలో చెరితే అదే చేదు అనుభవం ఎదురవుతుందని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 10 రో జుల క్రితమే ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింత ఆస్పత్రి ఆవరణలోనే ఆత్మహత్య చేసుకోవడం కలకలం లేపింది.
గతంలో బాత్రూం వద్దనే ఓ బాలింత డెలివరీ కావడం వైద్యుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచింది. నేను రాను.. బిడ్డో సర్కార్..దావకానకు అన్న చం దంగా మారిందని ఆస్పత్రికి వచ్చే రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాంతీయ ఆస్పత్రిలు ఉన్నప్పటికీ జిల్లా కేంద్ర ఆస్పత్రికి ఎక్కువ మంది డెలివరీ కోసం రావడంతో సౌకర్యాలు, వైద్య సిబ్బంది పూర్తిస్థాయిలో లేకపోవడం కూడా రోగుల పాలిట శాపంగా మారింది.
ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ అయితే కనీసం రూ.50 వేలతో పాటు ఆరోగ్య రక్షణ ఉంటుందని భావిస్తున్న గర్భిణీ కుటుంబాలకు ఆసుపత్రి గేటు దాటే అంతవరకు ఏం జరుగుతుందో అన్న ఆందోళన నెలకొంటుందన్నారు. అధికారులు, పాలకుల స్పందించి సరైన వసతులు కల్పించాలని కోరుతున్నారు.






