11 March, 2026 | 3:41 AM

అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు

11-03-2026 12:13 AM

దళారులను నమ్మి మోసపోవద్దు: కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్

హుజూర్ నగర్,మార్చి 10: అర్హులైన లబ్ధిదారులకే ఇందిరమ్మ ఇండ్లు కేటాయించడం జరుగుతుందని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పేర్కొన్నారు. పట్టణంలోని రామస్వామి గుట్టవద్ద 110 ఎకరాలలో నిర్మించిన మోడల్ హౌసింగ్ కాలనీని సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. మంగళవారం మోడల్ హౌసింగ్ కాలనీ ఇందిరమ్మ ఇండ్లు బ్లాకులు, అంతర్గత రోడ్లు, సభాస్థలిని, పార్కింగ్ పరిశీలించి పెండింగ్ లో ఉన్న అన్ని పనులను వారంలో పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.

లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉండాలని,అర్హత లేని వారికి జాబితాలో పేరు ఉండకూడదని అధికారులను ఆదేశించారు. అత్యంత అర్హులైన వారికి ప్రాధాన్యం ఇచ్చి ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా ప్రక్రియ చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ సిద్ధార్థ, పిడి హర్టికల్చర్ నాగయ్య, ఆర్డీవో శ్రీనివాసులు,ఈఈ మిషన్ భగీరథ కరుణాకర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్,తహసిల్దార్ కవిత,తదితరులు పాల్గొన్నారు.