1 July, 2026 | 7:57 PM

Breaking News

ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •   ఇందిరా శక్తి క్యాంటీన్లో భోజనం చేసిన కలెక్టర్   •   ఎర్రుపాలెంలో శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ తాత్కాలిక నిలుపుదలకు అనుమతి   •   బోనమెత్తిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు   •   ఎర్రుపాలెం ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టిన ఎం.శారద   •   కంచర్లలో తాగునీటి సమస్యకు పరిష్కారం   •   శ్రీ ఉమామహేశ్వరంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రత్యేక పూజలు   •   విజయ క్రాంతి వార్తకు స్పందన మొలకెత్తని సోయాబీన్ పొలాలను పరిశీలించిన అధికారులు   •   డిబిఎమ్ 6 కాల్వకు గండి   •   ఓస్ట్‌ఫాలియా యూనివర్సిటీతో శాతవాహన అవగాహన ఒప్పందం   •  

జూన్ 2 నుంచి ‘ఇందిరమ్మ’ జీవిత బీమా

21-03-2026 01:42 AM
  1. ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ఇన్సూరెన్స్

1.15 లక్షల కుటుంబాలకు అమలు

హైదరాబాద్, మార్చి 20 (విజయక్రాంతి): రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికీ భద్రత కల్పించేందుకు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రభుత్వం సంకల్పించింది. ఒక కుటుంబంలో ఆదాయం తెచ్చే వ్యక్తి దురదృష్టవశాత్తు అకస్మాత్తుగా మరణిస్తే ఆ కుటుంబానికి రూ.5 లక్షలు బీమా అందించనున్నారు. రాష్ట్రంలోని 1 కోటి 15 లక్షల కుంటుంబాలకు దీన్నీ వర్తింపచేయనున్నారు.

ఈ పథకానికి బడ్జెట్‌లో రూ.4 వేల కోట్లను కేటాయించారు. ఈ బీమా పథకాన్ని ఈ ఏడాది రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 02 నుంచి ప్రారంభించనున్నారు. కుటుంబ పెద్ద అకస్మాత్తుగా మరణిస్తే ఆ కుటుంబ ఆర్థిక కష్టాలు అన్నీఇన్నీ కావు. ఆ కుటుంబం పడే మానసిక వేదన ఒకటైతే, వాళ్లు ఎదుర్కొనే ఆర్థిక సమస్య మరోటి. ఈ ఒక్క సంఘటనతో ఆ కుటుంబం మొత్తం రోడ్డున పడే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి వారి కోసం పేద, మధ్యతరగతి, ధనిక అని తేడా లేకుండా ఆయా కుటుంబాలను ఆదుకునేందుకు రూ.5 లక్షల బీమా పథకాన్ని అందించేలా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది.